Type Here to Get Search Results !

Vinays Info

ప్రేమికుల రోజు లేదా సెయింట్ వాలెంటైన్స్ డే

Top Post Ad

ప్రేమికుల రోజు లేదా సెయింట్ వాలెంటైన్స్ డే అనేది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జరుపుకునే సెలవుదినం. ఆంగ్ల భాష మాట్లాడే దేశాల్లో, వాలెంటైన్స్ కార్డులు పంపడం, పువ్వులు బహూకరించడం లేదా మిఠాయిలు ఇవ్వడం ద్వారా ప్రేమికులు ఒకరికిఒకరు ఈ రోజున ప్రేమను వ్యక్తపరుచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అసంఖ్యాక క్రైస్తవ మృతవీరుల్లో (మతం కోసం బలిఇవ్వబడిన వ్యక్తులు) ఇద్దరికి వాలెంటైన్ అనే పేరు ఉండటంతో ఈ సెలవుదినానికి కూడా ఇదే పేరు చేర్చబడింది. మధ్యయుగ కాలానికి చెందిన జెఫ్రే చౌసెర్ రచనల కారణంగా శృంగార ప్రేమతో ఈ రోజుకు అనుబంధం ఏర్పడింది, ఈ కాలంలోనే నాగరిక ప్రేమ సంప్రదాయం కూడా వృద్ధి చెందింది.

"వాలెంటైన్స్" రూపంలో ప్రేమ సందేశాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంతో ఈ రోజుకు మరింత అనుబంధం ఉంది. హృదయాకృతులు, పావురాలు మరియు విల్లు, బాణం ధరించిన రెక్కలున్న క్యుపిడ్ (గ్రీకుల ప్రేమ దేవత పేరు, మన్మథుడు) బొమ్మలు ఆధునిక కాలంలో వాలెంటైన్ గుర్తులయ్యాయి. 19వ శతాబ్దం నుంచి, చేతితోరాసిన సందేశాలు ఇచ్చే సంప్రదాయం భారీ స్థాయిలో గ్రీటింగ్ కార్డ్‌ల తయారీకి మార్గం చూపింది.[1] గ్రేట్ బ్రిటన్‌లో పందొమ్మిదొవ శతాబ్దంలో వాలెంటైన్‌లను (ప్రేమ కానుకలను) పంపడం నాగరికమైంది, 1847లో ఈస్టర్ హౌలాండ్ అనే మహిళ మాసాచుసెట్స్‌లోని వర్సెస్టెర్‌లో ఉన్న తన ఇంటిలో బ్రిటీష్ నమూనాల్లో చేతితో వాలెంటైన్ కార్డులను తయారు చేసి విజయవంతమైన వ్యాపారాన్ని అభివృద్ధి పరిచారు. 19వ శతాబ్దపు అమెరికాలో వాలెంటైన్ కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి, ఈ దేశంలో ఇప్పుడు ఎక్కువ వాలెంటైన్ కార్డులు ప్రేమ ప్రకటనలతో కాకుండా సాధారణ గ్రీటింగ్ కార్డులుగా తయారవుతున్నాయి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మిగిలిన సెలవుదినాలను వ్యాపారాత్మకం చేసేందుకు ఇది భవిష్య సూచకమైంది. వ్యాపారాత్మక సెలవుదినాల్లో ఒకదానిగా ఇది పరిగణించబడుతోంది.

ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ వాలెంటైన్ కార్డులు పంపబడుతున్నట్లు U.S. గ్రీటింగ్ కార్డుల సంఘం అంచనా వేసింది, ఏడాదిలో క్రిస్మస్ తరువాత కార్డులు ఎక్కువగా పంపబడే రోజుగా వాలెంటైన్స్ డే గుర్తింపు పొందింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ రోజున మహిళల కంటే పురుషులు సగటున రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు సంఘం అంచనా వేసింది.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.