సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana)
👉ఈ పథకాన్ని 2015, జనవరి 22న ప్రధాని ప్రకటించారు. బాల్యవివాహాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆడపిల్ల పుట్టినప్పటినుంచి పదేండ్లలోపు పథకం కింద పోస్టాఫీస్‌లోగాని, బ్యాంక్‌లోగాని కనీసం రూ. 1000లతో ప్రారంభించవచ్చు.
👉జమచేసిన డబ్బులపై 9.1 శాతం వడ్డీతోపాటు ఆదాయ పన్ను రాయితీ లభిస్తుంది. ఈ అకౌంట్‌లో గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.
🔹పద్దెనిమిదేండ్లు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం డిపాజిట్ నుంచి కొంత సొమ్మును ఉపసంహరించుకోవచ్చు. ఈ ఖాతా 21 ఏండ్ల వరకు క్రియాశీలంగా ఉంటుంది.