కలపనిచ్చే మొక్కలు
బాగా గట్టిగా, దృఢంగా ఉన్న కాండాన్ని కలప అంటారు. కలపనిచ్చే మొక్కల అధ్యయనాన్ని డెండ్రాలజి అంటారు. కలపనిచ్చే మొక్కల పెంపకం సిల్వి కల్చర్.
కలప నుంచి తయారుచేసే పలుచటి పొరను వెనీర్ అంటారు. 3-10 వెనీర్ పొరలను అతికించి ైప్లెవుడ్‌ను తయారు చేస్తారు.
కాండాన్ని కోసినప్పుడు కనిపించే వలయాలను వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అంటారు. వీటి అధ్యయనం పేరు డెండ్రోక్రోనాలజి. వీటి సంఖ్యను బట్టి మొక్క వయస్సును నిర్ధారించవచ్చు.
-అతి తేలికైన కలప- ఒక్రోమా పైరామిడేల్
-అతి బరువైన కలప- గ్వాకమ్ అఫిసినేల్
-అతి బరువైన కలప- అకేషియా సుండ్రా
-గట్టిగా ఉండే తేలికైన కలప- సిడ్రస్ డియోడార్ (దేవదారు)
ఉదా:
1. టేకు (టెక్టోనా గ్రాండిస్): గట్టిగా, దృఢంగా ఉండే మన్నికైన కలప. ఎక్కువగా పండించే దేశం మయన్మార్. దీన్ని ప్రాక్ దేశపు రాజవృక్షం అంటారు. దక్షిణ భారతదేశంలోని పొడి ఆకురాల్చు అడవులు టేకు వృక్షాలకు ప్రసిద్ధి.
2. రక్త చందనం (టీరోకార్పస్ సాంటలైనస్): ఇది అతి ఖరీదైన కలప. అందుకే అధికంగా స్మగ్లింగ్‌కు గురవుతుంది. దీన్ని సంగీత పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా కర్ణాటకలోని బళ్లారి, ఏపీలోని చిత్తూరు, కడప జిల్లాల్లో పెరుగుతుంది.
3. ఇండియన్ రోజ్‌వుడ్ (డాల్బర్జియా లాటిఫోలియా): దీన్ని రైల్వే వ్యాగన్ల తయారీలో ఉపయోగిస్తారు.
4. శాండల్‌వుడ్ (సాంటాలమ్ ఆల్బా): ఈ కలపను సబ్బులు, కాస్మొటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు.
5. విల్లో/సాలిక్స్: క్రికెట్ బ్యాట్‌లు, హాకీ హ్యాండిళ్ల తయారీకి ఉపయోగిస్తారు.
6. సుబాబుల్: ఇది బహుళార్థసాధక మొక్క. దీని కలపను అగ్గిపుల్లల తయారీకి ఉపయోగిస్తారు. ఇది నీటి ఎద్దడిలో పెరుగుతుంది. వేర్లు నత్రజని స్థాపన చేస్తాయి.
7. పునికి చెట్టు (గివోకియా మోలుసియానా): దీని కలపను కొండపల్లి (కృష్ణ), నిర్మల్ (ఆదిలాబాద్) కొయ్యబొమ్మల తయారీలో ఉపయోగిస్తారు.
కలపనిచ్చే మొక్కలు
February 12, 2017