తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1. 2014, జూన్ 2 2. 1999, జనవరి 2
3. 2012, జూన్ 2 4. 1998, ఆగస్టు 10
Answer: 2014, జూన్ 2
Q. పర్వతాన్ని ఎక్కే వ్యక్తి ముందుకు వంగడానికి ప్రధాన కారణం
1. జారడాన్ని తప్పించుకోవడానికి 2. వేగం పెంచడానికి
3. అలసట తగ్గించుకోవడానికి 4. స్థిరత్వం పెరగడానికి
Answer: స్థిరత్వం పెరగడానికి
Q. 'శతసహస్ర హాలక' బిరుదున్న పాలకుడు ఎవరు?
1. వాశిష్టీపుత్ర శాంతమూలుడు 2. వీరపురుషదత్తుడు
3. ఎహూబల శాంతమూలుడు 4. రుద్రపురుషదత్తుడు
Answer: వాశిష్టీపుత్ర శాంతమూలుడు
Q. అయస్కాంత భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న ఇస్రో కేంద్రం?
1. షార్ - శ్రీహరికోట 2. టెర్ల్స్ - తిరువనంతపురం
3. ఆంట్రిక్స్ - బెంగళూరు 4. ఏదీకాదు
Answer: టెర్ల్స్ - తిరువనంతపురం
Q. తెలంగాణలోని ఏ జిల్లా బొగ్గును ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది?
1. ఖమ్మం 2. వరంగల్
3. ఆదిలాబాద్ 4. కరీంగనర్
Answer: కరీంగనర్
Q. భారతదేశంలో 'నిత్యావసర వస్తువుల చట్టం'ను ఎప్పుడు రూపొందించారు?
1. 1950 2. 1951
3. 1955 4. 1965
Answer: 1955
Q. 'కాంట్రాక్టు' అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది?
1. Contractum 2. Contract
3. Contractim 4. ఏదీకాదు
Answer: Contractum
Q. 'సాగరమాత'కు మరో పేరేంటి?
1. కైలాశ్ 2. ఎవరెస్టు
3. కె 2 4. కాంచనజంగ
Answer: ఎవరెస్టు
Q. మహ్మద్ గజనీ చేతిలో ఓడిపోయి, ఆత్మహత్యకు పాల్పడిన తొలి హిందూ రాజెవరు?
1. పృథ్వీరాజ్ 2. జయపాలుడు
3. ఆనందపాలుడు 4. జయచంద్రుడు
Answer: జయపాలుడు
Q. మూలకాల రారాజు (King of the elements) అని ఏ మూలకాన్ని పిలుస్తారు?
1. ఆక్సిజన్ 2. కార్బన్
3. సిల్వర్ 4. గోల్డ్
Answer: కార్బన్
Q. ఏ సింధు నాగరికతా ప్రాంతంలో 'ఒంటె' ఆనవాళ్లు లభ్యమయ్యాయి?
1. లోథల్ 2. కాలిబంగన్
3. హరప్పా 4. మొహంజోదారో
Answer: కాలిబంగన్
Q. బాదామి చాళుక్యుల్లో చివరివాడు ఎవరు?
1. రణరాగడు 2. విక్రమాదిత్య
3. రెండో కీర్తివర్మ 4. విజయాదిత్యుడు
Answer: రెండో కీర్తివర్మ
May 26, 2016