1952 జాతీయ అటవీ విధానం ప్రకారం ఆవరణ సమతౌల్యాన్ని కాపాడడానికి మైదానాలలో 20 శాతం, పర్వతాలు, కొండ ప్రాంతాలలో 60 శాతం, మొత్తం మీద సగటున భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉన్నాయి అని నిర్ధారించడం జరిగింది.
ఇండియాలో మొత్తం 33 శాతం వరకు అడవులు ఉన్నాయి అని అప్పట్లో నిర్ధారించడం జరిగింది. కాని ప్రస్తుతం మన భూభాగంలో అడవుల 21.23 శాతంగా ఉన్నాయి.
భారతదేశం అడవులని 4 రకలుగా వర్గీకరించవచ్చు.
1. సతత హరిత అరణ్యాలు :
- అధిక వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమద్యరేఖా ప్రాంతాలు కేరళ, అండమాన్ లలో ఈ సతత హరిత అరణ్యాలు అనేవి ఉంటాయి.
- ఈ అడవులలో వెదురు, నేరేడు చెట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఈ సతత హరిత అరణ్యాలు అనేవి ఎక్కడ కూడ లేవు.
- హిమాలయాలలో మరో రకపు సతత హరిత అరణ్యాలు ఉన్నాయి. ఇవి సంవత్సరమంతా పచ్చగా ఉండే దేవదారు చెట్ల అడవులు, వీటి ఆకులు సన్నగా సూదులు మాదిరిగా ఉంటాయి.
- ఈ చెట్లుకి పుష్పాలు పూయవు, ఇవి శంకువులు వంటి పునరుత్పత్తి భాగాలు కలిగి ఉంటాయి.
2.ఆకురాల్చు అడవులు :
- కొన్ని నెలలు వరకే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఈ ఆకురాల్చు అడవులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి.
- సాదారణంగా ఈ ఆకురాల్చు అడవులు వర్షపాతం మీద ఆధారపడి 2 రకాలుగా ఉన్నాయి.
- ఎక్కువ వర్షపాతం ఉండే ఆకురాల్చు అడవులలో వేగి, ఏగిస, బండారు, మద్ది, జిట్టింగి వంటి చెట్లు ఎక్కువగా ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉండే ఆకురాల్చు అడవులలో టేకు, వెలగ, తూనిక, చిగురు, వేప, బూరుగ వంటి చెట్లు ఎక్కువగా ఉంటాయి.
- ఈ ఆకురాల్చు అడవులని ఋతుపవన అరణ్యాలు అని కూడ పిలుస్తారు. ఈ ఆకురాల్చు అడవులు హిమాలయ ప్రాంతపు ఉప ప్రాంతాలలో ఉంటాయి.
3.ముళ్ళ అడవులు :
- తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉండే పొడి ప్రాంతాలలో ఎక్కువగ పెరుగుతుంటాయి.
- ఈ రకమైన అడవులు దట్టంగా ఉండవు. తక్కువ చెట్లు, పొదలుగా ఉన్న ఖాళీ ప్రదేశాలుగా ఈ అడవులు ఉంటాయి.
- ఈ ముళ్ళ అడవులలో తుమ్మ, రేగ, సీతాఫలం, మోదుగ వంటి చెట్లు ఎక్కువగ పెరుగుతాయి.
4.సముద్ర తీరప్రాంతపు చిత్తడి అడవులు :
- ఈ అడవులు సముద్ర తీరప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. ఉప్పు నీటికి మరియు మంచినీటికి కూడ అనువుగా ఉండేలా ఈ అడవులలోని చెట్లు పెరుగుతుంటాయి.
- ఈ అడవులని మడ అడవులు అని కూడ అంటారు. ఈ సముద్ర తీరప్రాంతపు చిత్తడి అడవులలో ఊరడ, మండ, తెల్ల మండ, గుండు మండ, కజిడి, బెల్ల వంటి చెట్లు అనేవి ఎక్కువగా పెరుగుతుంటాయి.
భారతదేశంలోని అడవులు -Forests in India https://t.co/vSTFDNtC5F #forestinindia#India #IndianForest #VinaysInfo #MukkaniBrothers
— VinaysInfo (@VinaysInfo) March 28, 2021