Type Here to Get Search Results !

Vinays Info

Excretory Organs - విసర్జక అవయవాలు

ఏకకణ జీవులలో విసర్జన అనేది శరీరం ఉపరితలం నుండి వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది.

ప్రోటోజువా, సిలేంటరేటా వంటి జీవులు ఏకకణ జీవుల కి ఉదాహరణలు గా చెప్తారు.

ఈ ప్రొటోజువా, సిలేంటరేటా జీవులలో విసర్జన అనేది శరీరం ఉపరితలం నుండి వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది.

విసర్జక అవయవాలు :

  • విసర్జక అవయవాలు ఏయే జీవులలో ఏ రకంగా ఉంటయో చూసినట్లయితే,
  • ప్లనేరియా వంటి బల్లపు పరుపు జీవులలో విసర్జన అనేది జ్వాల కణాల ద్వారా జరుగుతుంది అని చెప్పవచ్చు.
  • వానపాము లో విసర్జన అనేది వృక్కాల ద్వారా జరుగుతుంది అని చెప్తారు.
  • జలగ లో కూడ విసర్జన అనేది వృక్కాల ద్వారానే జరుగుతుంది అని చెప్తారు.
  • వానపము, జలగ ఈ రెండు కూడ అనిలెడ వర్గానికి చెందిన జీవులు గా చెప్పడం జరుగుతుంది.
  • అర్ధ్రోపోడా జీవులలో విసర్జన అనేది మాల్ఫీజియన్ నాళికలు ద్వారా జరుగుతుంది అని చెప్తారు.
  • గొల్లబామ వంటి మొదలైన జీవులను అర్ధ్రోపోడా జీవుల కి ఉదాహరణలు గా చెప్తారు.
  • మొలస్కా వర్గానికి చెందిన జీవులలో విసర్జన అనేది వృక్క సమూహాల మూత్రపిండాల ద్వారా జరుగుతుంది అని చెప్పవచ్చు.
  • సముద్రపు జీవుల ను మొలస్కా వర్గానికి చెందిన జీవులు గా చెప్తారు.
  • నత్త, ఆల్చిప్ప వంటి సముద్రపు జీవులు మొలస్కా వర్గానికి చెందిన జీవులు గా చెప్పడం జరుగుతుంది.
  • అన్ని సకశేరుకాలల్లో విసర్జన అనేది మూత్రపిండాల ద్వారా జరుగుతుంది.
  • వెన్నుముక కలిగిన అన్ని జీవులను సకశేరుకాలు గా పేర్కొంటారు.
  • మానవుని విసర్జక వ్యవస్థ లో ఒక జత మూత్రపిండాలు ఉంటాయి, నత్రజని అంత్య పదార్ధం గా యూరియా ను పేర్కొనడం జరిగింది.
  • మానవుని మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి.
  • ఈ మూత్రపిండాలు రక్తాన్ని శుద్ది చేస్తాయి. ఇక్కడ శుద్ది చేయబడిన రక్తాన్ని హృదయానికి పంపించడం జరుగుతుంది.
  • హృదయం నుండి మూత్రపిండాల కి రక్తాన్ని తీసుకువచ్చే నాళాన్ని వృక్క ధమని అని అంటారు.
  • మూత్రపిండాల నుండి హృదయం కి రక్తాన్ని తీసుకుపోయే నాళాన్ని వృక్క సిర అని అంటారు.
  • వీటికి బయటి వైపు ఎరుపు రంగులో ఉండే భాగాన్ని వల్కలం అని అంటారు.
  • మూత్రపిండాల కి లోపలి వైపు ఉండే భాగాన్ని దవ్వ అని అంటారు.
  • ఈ దవ్వ లో 9 నుండి 12 వరకు సూచి స్తంబాలు ఉండటం జరుగుతుంది.
  • ప్రతి ఒక్క మూత్రపిండం మీద అధివృక్క గ్రంథి అనేది ఒకటి ఉంటుంది. దీనిని ఒక వినాళ గ్రంథి గా పేర్కొనడం జరిగింది.
  • మూత్ర నాళికలు అనేవి మాత్రపిండాల యొక్క ప్రమాణాత్మక నిర్మాణాలు గా చెప్పడం జరుగుతుంది.
  • ఈ మూత్ర నాళికలు అనేవి మాత్రాన్ని ఏర్పరచడంలో ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు.
  • మూత్రపిండంలోని ఈ మూత్ర నాళికలు అనేవి రెండు లక్షలు (2,00,000) వరకు ఉంటాయి అని చెప్తారు.
  • మూత్రపిండంలోని ప్రతి మూత్ర నాళికలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి భౌమన్ గుళిక, రెండోది నాళికా భాగం.
  • హెన్లీశిక్యం అనేది పక్షులలో మాత్రమే ఉంటుంది.
  • మూత్రపిండాలు సరిగా పని చేయని వ్యక్తుల్లో రక్తంలోని విసర్జక పదార్ధాలను వేరు చేయడాన్ని డయాలసిస్ అని అంటారు. ఈ చర్యకు డయాలసిస్ అనే యంత్రాన్ని వాడతారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section