ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ప్రతి ఒక్కరికి పరిపాటి అయిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంటారు. అయినప్పటికీ వాహనదారులు మాత్రం మారరు. రాంగ్ రూట్‌లో ప్రయాణించే వారికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో పుణె ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి తెర తీశారు. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ మాదరిగానే.. పదునైన ఇనుప ముక్కలను ఏర్పాటు చేశారు. సరియైన మార్గంలో వెళ్లే వారికి ఈ ఇనుప ముక్కలు ఎలాంటి ప్రమాదానికి కారణం కావు. కానీ రాంగ్‌రూట్‌లో వచ్చే వాహనదారులకు మాత్రం ఇబ్బంది. అలాంటి వాహనాల టైర్లు పంక్చర్ కావాల్సిందే. ఇలాంటి స్పీడ్ బేకర్లు ఏర్పాటు చేసిన చోట టైర్ కిల్లర్ అని సూచించే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులు.
రాంగ్ రూట్ లో వెళ్తే టైర్ పంక్చర్ అయ్యేలా ఏర్పాటు చేసిన నగరం-పూణే
March 31, 2018
Tags