రాష్ట్రీయం
1) నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ఎంత శాతం జీఎస్టీ విధించడాన్ని రాష్ట్ర సర్కార్ తప్పుబడుతోంది ?
జ: 12శాతం
2)మాజీ ప్రధాని పీ.వి.నర్సింహారావు చొరవతో ఏర్పడిన తెలుగు అకాడమీ 50వ యేట అడుగుపెడుతోంది. అకాడమీని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
జ: 1968 ఆగస్టు 6న
3) నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమం కింద రాష్ట్ర సర్కార్ ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఎంత మొత్తం నిధులు ఇస్తోంది ?
జ: రూ.3 కోట్లు
4) తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి ఏ తేదీన జరుపుకుంటారు ?
జ: ఆగస్టు 6
5) మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారం – 2017 కు ఎవరు ఎంపికయ్యారు ?
జ: మంతెన రమేశ్ ( ది బొంబాయి ఆంధ్రమహాసభ, జింఖానా ముంబై అధ్యక్షుడు)
6) రెండు వేల క్రితం శాతవాహనులకు ముందు నాటివిగా భావిస్తున్న టెర్రకోట మట్టి పూసలు, పాత్రలు, పెంకులు, ఇటుకరాళ్ళు ఇటీవల ఎక్కడ బయటపడ్డాయి ?
జ: మంచిర్యాల జిల్లా కర్ణమామిడిలో
7) భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్), జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ (నార్మ్) సంయుక్తంగా అగ్రి ఉడాన్ రోడ్ షోనో వచ్చే నెలలో ఎక్కడ
నిర్వహించనున్నారు ?
జ: హైదరాబాద్ లో
8) ధ్యాన్ చంద్ అవార్డుకు నామినేట్ అయిన హైదరాబాదీ షాహిద్ హకీం ఏ క్రీడకు చెందినవారు ?
జ: ఫుట్ బాల్
9) సాయ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న GSSV ప్రసాద్ ను కోచింగ్ లో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డుకు నామినేట్ చేశారు. ఆయన గతంలో ఏ క్రీడలో ప్రావీణ్యులు ?
జ: బ్యాడ్మింటన్
జాతీయం
10) దేశ 13వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎం.వెంకయ్యనాయుడికి ఎన్ని ఓట్లు వచ్చాయి ?
జ: 516
(నోట్: మొత్తం ఓట్లు 785, పోలైనవి: 771, చెల్లనివి:11, జీకే గాంధికి : 244)
11) ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ?
జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
12) దేశ 13 వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఈనెల 11న బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన రెండో వ్యక్తి. అంతకుముందు ఈ పార్టీ నేపథ్యం నుంచి
ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: భైరాన్ సింగ్ షెకావత్ 2002-07
13) ఒక వ్యక్తిని ఎన్నిసార్లు ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునే అవకాశం ఉంది ?
జ: ఎన్ని సార్లయినా
14) ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే 14 రోజుల ముందస్తు నోటీసుతో ముందుగా ఏ సభలో తీర్మానం ప్రవేశపెట్టాలి ?
జ: రాజ్యసభలో మాత్రమే ( ఆతర్వాత లోక్ సభలో )
15) నీతి ఆయోగ్ తదుపరి వైస్ ఛైర్మన్ గా ఎవరు నియమితులు కానున్నారు ?
జ: ఆర్థికవేత్త రాజీవ్ కుమార్
16) నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా ఎప్పటి వరకూ పదవిలో కొనసాగుతారు ?
జ: ఆగస్టు 31 వరకూ (ఇటీవలే రాజీనామా చేశారు )
17) ట్రాక్టర్ విడిభాగాలపై జీఎస్టీని ఎంతగా నిర్ణయిస్తూ జీఎస్టీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది ?
జ: 18శాతం
18) దేశంలో మెట్రోరైలు ప్రాజెక్టులకు ఆద్యుడైన శ్రీధరన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోస్టుకి రాజీనామా చేశారు ?
జ: ఆంధ్రప్రదేశ్
19) పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపు నిరోధానికి కేంద్రం ప్రవేశపెట్టిన పోర్టల్ ఏది ?
జ: షీ బాక్స్
20) సముద్ర లోతుల్లోకి ముగ్గురు మనుషుల్ని తీసుకెళ్ళే తొలి మానవసహిత సబ్ మెర్సిబుల్ ను ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు ?
జ: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ESSO)
21) WBO ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ తో పాటు ప్రత్యర్థికి చెందిన ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ ను సొంతం చేసుకున్న భారతీయ బాక్సర్ ఎవరు ?
జ: విజేందర్
(నోట్: ఆయన ప్రత్యర్థి చైనాకు చెందిన జుల్ఫికర్ మైమైటియాలి)
22) ఆసియా షాట్ గన్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం గెలుచుకున్న భారతీయ షూటర్ ఎవరు ?
జ: అంకుర్ మిట్టల్
అంతర్జాతీయం
23) సైబర్ ముప్పు పొంచిఉందన్న ఆందోళనతో చైనా డ్రోన్ల వాడకాన్ని ఏ దేశం నిలిపేసింది ?
జ: అమెరికా
24) శాన్ ఫ్రాన్సిస్కోలోని కెనడా కాన్సుల్ జనరల్ గా నియమితులైన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు ?
జ: రానా సర్కార్
25) పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది ?
జ: 2020 నవంబర్ 4