రాష్ట్రీయం
1) రాష్ట్రంలో భూవివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఎన్ని గ్రామాల్లో సమగ్ర భూ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 10,850 గ్రామాల్లో
2) రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ విధానం ప్రకారం ఎన్ని పాయింట్లు నమోదైతే లైసెన్సులను రద్దు చేస్తారు ?
జ: 12 పాయింట్లు
3) హిందూ దినపత్రిక మాజీ చీఫ్ ఎడిటర్ ఎన్.రామ్ తను రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు. ఆ పుస్తకం పేరేంటి ?
జ: Why Scams are here to Stay
4) రాష్ట్రంలో చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఎవరి పేరుతో అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కొండా లక్ష్మణ్ బాపూజీ
5) ఓరుగల్లు చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు ఎవరికి బాధ్యతలు అప్పగించారు ?
జ: అమెరికాలోని బోస్టన్ కు చెందిన వెస్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫిలిప్ బి వాగ్నర్ కు
6) ఓరుగల్లు కట్టడాలపై వాగ్నర్ ఏ పేరుతో పుస్తకం తీసుకురావాలని భావిస్తున్నారు ?
జ: టూర్ గైడ్ ఆఫ్ కాకతీయ హెరిటేజ్
జాతీయం
7) స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15నాడు ఏ దివస్ గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చింది ?
జ: సంకల్ప్ పర్వ (సంకల్ప దినం)
8) ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఎన్ని లక్షల పాన్ కార్డులను తాత్కాలికంగా చెల్లుబాటు కాకుండా చేసింది ?
జ: 11.44 లక్షలు
9) అభ్యసనం, విద్య విభాగాల్లో ఎమ్‌బిలియంత్ దక్షిణాసియా-2017 అవార్డు దేశంలోని ఏ యాప్ కి దక్కింది ?
జ: జాతీయ డిజిటల్ గ్రంథాలయ (NDL) యాప్ కు
(నోట్: ఈ యాప్ ను ఐఐటీ, ఖరగ్ పూర్ లో రూపొందించారు )
10) ఆసియా పసిఫిక్ ఏరియాలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి పేపాల్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: మాస్టర్ కార్డ్
11) పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలులో పేదలను గుర్తించేందుకు ఏ రిపోర్టును ప్రామాణికంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ – 2011
12) సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ – 2011 ప్రకారం దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన (BPL) నివసిస్తున్న గ్రామీణ జనాభా ఎంత శాతం ?
జ: గ్రామీణ జనాభాలో 62 శాతం
13) గోరక్షకులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి గో సేవా ఆయోగ్ పేరుతో కమిషన్లు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి ?
జ: హరియాణా, ఉత్తరాఖండ్
14) SVUలు, విలాస కార్లపై ఎంతశాతం జీఎస్టీని పెంచుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది ?
జ: 25 శాతం (గతంలో 1-15 శాతం)
15) బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (IRDAI) ఛైర్మన్ ఎవరు ?
జ: టి.ఎస్. విజయన్
16) ఏ క్రికెటర్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డును (BCCI) ను కేరళ హైకోర్టు హెచ్చరించింది ?
జ: శ్రీ శాంత్
17) బెంగళూరు హాకీ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో MCC-మురుగప్ప గోల్డ్ కప్ ను గెలుచుకున్న జట్టు ఏది ?
జ: ONGC
18) 7వ ఆసియాన్ షాట్ గన్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం గెలుచుకున్న భారతీయ ఆటగాడు ఎవరు ?
జ: అంకుర్ మిట్టల్
అంతర్జాతీయం
19) ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా నియమితులైన భారతీయురాలు ఎవరు ?
జ: ఎస్. అపర్ణ
(నోట్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు)
20) లండన్ కు చెందిన బ్రిలియంట్ బేసిక్స్ ను 7.5 మిలియన్ పౌండ్లు ( రూ.62.76 లక్షల) రూపాయలతో కొనుగోలు చేసిన భారతీయ ఐటీ దిగ్గజం ఏది ?
జ: ఇన్ఫోసిస్
21) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రతిష్టాత్మక కమ్యూనిటీ సర్వీస్ మెడల్ అవార్డు అందుకుకున్న భారతీయుడు ఎవరు ?
జ: ఫిరోజ్ మర్చంట్
22) పర్యావరణ రీసెర్చ్ కోసం ఇజ్రాయెల్ ప్రయోగించిన ఉపగ్రహం పేరేంటి ?
జ: వీనస్
23) ప్రపంచంలో అత్యధికంగా బీఫ్ ను ఎగుమతి చేస్తున్న దేశం ఏది ?
జ: బ్రెజిల్
24) 2018 ఆసియాన్ ఫుట్ బాట్ కన్ఫెడరేషన్ అండర్ 19 ఛాంపిన్షిప్ పోటీలు ఎక్కడ జరుగుతాయి ?
జ: ఇండోనేషియా