1) కాకతీయుల కాలంలో న్యాయ విషయాల్లో రాజుకు సలహాలు ఇవ్వడానికి నియమించుకున్న అధికారి ఎవరు ?
ఎ) ప్రాడ్విచాకులు
బి) రుత్వికులు
సి) తాత్వికులు
డి) యాత్రికులు
2) రెండో ప్రతాపరుద్రుడిని మాలిక్ కాసర్ ఓడించిన సంవత్సరం ?
ఎ) క్రీ.శ.1323
బి) క్రీ.శ.1318
సి) క్రీ.శ.1303
డి) క్రీ.శ.1310
3) కాకతీయుల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు ?
ఎ) పెరికె ఎండ్ల సుంకం
బి) అమ్మబడి సుంకం
సి) అరి
డి) పెమ్ట సుంకం
4) కాకతీయుల కాలంనాటి ఏ గ్రంధం అప్పటి శిక్షల గురించి వివరిస్తుంది ?
ఎ) ప్రతాప చరిత్ర
బి) విజ్నానేశ్వరీయం
సి) క్రీడాభిరామం
డి) పండితారాధ్య చరిత్ర
5) ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండిస్తున్నట్లు వివరించినవారు ఎవరు ?
ఎ) మహదేవుడు
బి) రుద్రదేవుడు
సి) మార్క్ పోలో
డి) బేతన
6) కాకతీయుల కాలంలో రూకలు అంటే ఏమిటి ?
ఎ) రూపాయి
బి) వెండినాణేలు
సి) గద్వాణం
డి) పైవేవి కావు
7) బాపట్ల శాసనం ప్రకారం ఒక మాడకు ఎన్ని రూకలు ?
ఎ) 25
బి) 15
సి) 20
డి) 10
8) కాకతీయుల కాలంలో భూమిశిస్తు ఎంత ?
ఎ) పండిన పంటలో 1/3వ వంతు
బి) పండిన పంటలో 1/7వ వంతు
సి) పండిన పంటలో 1/6వ వంతు
డి) పండిన పంటలో 1/5వ వంతు
9) కాకతీయుల కాలంలో రాజును రక్షించే ప్రత్యేక అంగరక్షక దళంపేరు ?
ఎ) నగరీశ్రీకావలి
బి) అయ్యగార్లు
సి) లెంకలు
డి) నాయంకరులు
10) కాకతీయుల కాలంలో వేశ్యలపై విధించిన పన్ను ఏంటి ?
ఎ) భూమి పన్ను
బి) గణాఛారి పన్ను
సి) వృత్తి పన్ను
డి) పైవేవి కావు
11) కాకతీయుల నాణేల్లో అతి పెద్దది ?
ఎ) చిన్నము
బి) నిష్కం
సి) గడాణ్యము
డి) రూక
12) కాకతీయుల కాలంలో బంగారు నాణేలు ?
ఎ) వెండి నాణేలు
బి) నిష్కణము
సి) చిన్నము
డి) రూక
13) శైవ ఆలయం,అనాధాశ్రమం,ఆరోగ్యశాఖ, విద్యాకేంద్రాలు ఒకే ప్రదేశంలో ఉంటే వాటిని ఏమంటారు ?
ఎ) బిల్వ మఠాలు
బి) రాజ్య మఠాలు
సి) గోళకి మఠాలు
డి) పైవేవి కావు
14) కాకతి రుద్రుడు 1162లో వేయి స్తంభాల గుడిని ఏ పద్దతిలో నిర్మించారు ?
ఎ) వలయకారం
బి) త్రికూట
సి) త్రిభుజాకారం
డి) అర్థచంద్రాకారం
15) పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, వృషాదివ శతకం రచయిత ఎవరు ?
ఎ) నన్నయ
బి) హరిహరనాథుడు
సి) మొదటి ప్రతాపరుద్రుడు
డి) పాల్కురికి సోమనాధుడు
16) కాకతీయుల కాలంలో చిత్రశాలను నిర్మించినవారు ఎవరు ?
ఎ) లీలావతి
బి) గౌతమి బాలశ్రీ
సి) మాచలదేవి
డి) లలితాంబ
17) కాకతీయుల కాలంలో గొప్ప కాలాముఖ క్షేత్రం ?
ఎ) ఓరుగల్లు
బి) అలంపురం
సి) వేములవాడ
డి) బాసర
18) వినుకొండ వల్లభామాత్యుడు ఏ గ్రంధం ఆధారంగా క్రీడాభిరామాన్ని రచించాడు ?
ఎ) నీతిసారం
బి) ప్రతాప చరిత్ర
సి) ప్రేమాభిరామం
డి) పండితారాధ్య చరిత్ర
19) కాకతీయుల కాలంలో చాపకూడును ప్రారంభించినవారు ఎవరు ?
ఎ) రుద్రదేవుడు
బి) గణపతిదేవుడు
సి) మహదేవుడు
డి) పల్నాటి బ్రహ్మనాయుడు
20) జాయపసేనాని రచనలు ఏమిటి ?
ఎ) నీతిసారం
బి) గీతరత్నావళి
సి) పండితారాధ్య చరిత్ర
డి) పైవేవి కావు
21) కాకతీయుల కాలంలో సర్వసాధారణ వినోదం ఏంటి?
ఎ) గొల్లసుద్జులు
బి) బతుకమ్మ ఆట
సి) తోలుబొమ్మలాట
డి) పైవేవి కావు
22) ధర్మసాగర శాసనంలో పేర్కొన్న వాయిద్యం ఏది?
ఎ) వీణ
బి) జలకరండ
సి) తబల
డి) మృదంగం
23) తెలుగు సాహిత్యంలో తలమానికమైన ద్విపద కావ్యం?
ఎ) నీతిసారం
బి) పండితారాధ్య చరిత్ర
సి) రంగనాధ రామాయణం
డి) పైవేవి కావు
24) కాకతీయుల కాలాన్ని ఎలా పిలుస్తారు?
ఎ) స్వర్ణ యుగం
బి) తామ్ర యుగం
సి) శూద్ర యుగం
డి) పైవేవి కావు
25) కాకతీయుల పాలనలో కుల సంఘాలను ఏమని పిలిచేవారు ?
ఎ) విషయములు
బి) సమయములు
సి) సాతానులు
డి) జంగాలు