టెట్ ఫైనల్ కీ విడుదల
హైదరాబాద్: ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్) ఫైనల్ కీ విడుదల చేసినట్లు కన్వీనర్ బి.శేషుకుమారి వెల్లడించారు. ఈనెల 23న టెట్ నిర్వహించగా, 25న ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. దానిపై అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలు సేకరించి శనివారం ఫైనల్ కీ ప్రకటించారు. దాన్ని టెట్ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఆగస్టు 5న టెట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Social Plugin