Type Here to Get Search Results !

Vinays Info

నిజాం రాజ్యంలో ప్రజాచైతన్యం

Top Post Ad

కాళిదాసు

గుప్తుల కాలంలో నవరత్నాల్లో ఒకడు కాళిదాసు ఇతనిని ఇండియన్ షేక్స్‌పియర్ అని పిలుస్తారు. ఇతని రచనలు నాటకాలు 1. అభిజ్ఞాన శాకుంతలం 2. మాళవికాగ్ని మిత్రం 3. విక్రమోర్వశీయం కావ్యాలు 1. కుమరసంభవం 2. రఘువంశం 3. రితుసంహరం 4. మేఘదూతం

-నిజాం నిరంకుశ పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యంలో ప్రజాచైతన్యం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశమంతటా జరుగుతున్న ప్రజా పోరాటంలో చైతన్యవంతమైన నిజాం రాజ్యంలోని విద్యావంతులు సొంతంగా ప్రజా సంఘాలను స్థాపించి ప్రజలను చైతన్యపర్చారు.
-1901 నుంచి 1908 వరకు హైదరాబాద్‌లో ఆర్యసమాజ్ అనేక కార్యక్రమాలు చేపట్టింది. శ్రీపాద దామోదర్, సత్యా లేకర్ తెలంగాణ ప్రాంతమంతా పర్యటించి ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా స్వదేశీ ఉద్యమంలో ప్రజలను పాల్గొనేలా చైతన్యపరిచారు.
-ముల్లా అబ్దుల్ బాసిత్ ద రెడ్ క్రిసెంట్ సొసైటీని స్థాపించడం ద్వారా ఖిలాఫత్ ఉద్యమంలో హైదరాబాద్‌లోని విద్యావంతులైన ముస్లింలు పాల్గొని టర్కీల పట్ల తమ సానుభూతిని ప్రకటించారు.
-1918లో హైదారాబాద్‌లో రాజ్యాంగ సంస్కరణల కోసం స్థాపించిన రాజకీయ సంస్థ హైదరాబాద్ రాష్ట్ర సంస్కరణల సంఘం.
-ఇది పత్రికల స్వేచ్ఛ, బాధ్యతాయుత ప్రభుత్వం మొదలైన విషయాల గురించి అనేక తీర్మానాలు చేసి హైదరాబాద్ స్వాతంత్య్ర సమరంలో తమవంతు పాత్ర పోషించింది.
-ఆంధ్రమహాసభ గ్రంథాలయ, విద్యా కార్యక్రమాలేకాక, రైతులకు తక్కావి రుణాలను ఇవ్వాలని, ఖాదీ, చేనేత పరిశ్రమలకు పన్నుల మినహాయింపు ఇవ్వాలని, యునానీ హకీంలతో సమానంగా ఆయుర్వేద వైద్యులకు సహాయం చేయాలని, స్త్రీలపై పరదా విధానం నిషేధించాలని అనేక తీర్మానాలు చేపట్టారు.
-1934లో సర్ నిజామత్ జంగ్ అధ్యక్షుడిగా నిజాం ప్రజల సంఘం ఏర్పడింది. ఇది స్థానిక విద్యార్థులకే ఉద్యోగాలు ఇవ్వాలని, ముల్కీ హక్కులు కాపాడటానికి, పౌరహక్కులు సంపాదించడానికి కృషి చేసింది.
-1938లో వచ్చిన వందేమాతర ఉద్యమం హైదరాబాద్‌లో జరిగిన ప్రముఖ సంఘటనగా చెప్పుకోవచ్చు.
-అయితే భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగానే హైదరాబాద్‌లో కూడా సాతంత్య్ర సమరానికి వివిధ పత్రికలు ఎంతో కృషి చేశాయి.
-హైదరాబాద్ రికార్డ్, మొవాలియే-ఇ-షఫీక్ సంపాదకుడు మౌల్వీ మోహిత్ హుస్సేన్ స్త్రీ విద్యాభివృద్ధికి కృషిచేశాడు.
-జీపీఎఫ్ గల్లాఘర్ సంపాదకత్వంలో వెలువడిన దక్కన్ టైమ్స్ వారపత్రిక చెప్పుకోదగింది.
-ఇలా అనేక సంస్థలు, పత్రికలు తమవంతు పాత్ర పోషించి హైదరాబాద్‌లో స్వాతంత్య్ర ఉద్యమానికి నాందిపలికాయి.

భారత జాతీయ కాంగ్రెస్

-హైదరాబాద్ ప్రభుత్వంలో కొందరు ఉన్నతోద్యోగులు కాంగ్రెస్‌ను ఆహ్వానించారు. ముల్లా అబ్దుల్ ఖయ్యూం, అఘోరనాథ్ ఛటోపాధ్యాయవల్ల ప్రభావితమైనవారు చందా రైల్వే స్కీమ్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు.
-సఫిల్-ఎ-దక్కన్ అనే స్థానిక పత్రికలో కాంగ్రెస్‌ను సమర్థిస్తూ వ్యాసాలు రాశారు.
-కాంగ్రెస్‌కు అనుకూలంగా ముల్లా అబ్దుల్ ఖయ్యూం 1906 వరకు ఎన్నో కార్యక్రమాలు, కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తూ బహిరంగ సభలు నిర్వహించాడు.
-ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు భాషల్లో వేర్వేరుగా ప్రకటనలు ఇవ్వడమే కాకుండా ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేశాడు.
-అయితే మెహిదీ అలీ, మొహసీన్-ఉల్-ముల్క్, ఇమాదుల్ ముల్క్ బిల్‌గ్రామ్, వికార్-ఉల్-ముల్క్, మెహదీ హసన్, ఫతే నవాజ్ జంగ్ వంటి ఉన్నతాధికారులు కాంగ్రెస్ అవతరణను ఖండించారు.

నిజాం రాజ్యంలో తొలి కాంగ్రెస్ వాదులు

-అఘోరనాథ్ ఛటోపాధ్యాయ గొప్ప శాస్త్రవేత్త, తత్వవేత్త. సంస్కృతంలో గొప్ప విద్వాంసుడు. ఇతడు ఎడిన్‌బరో, బాన్ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించాడు.
-1877లో సాలార్‌జంగ్ ఇంగ్లండ్ వెళ్లినప్పుడు అఘోరనాథ్‌తో పరిచయమైంది. అఘోరనాథ్ బెంగాల్‌కు తిరిగి వచ్చిన తర్వాత రాజారామ్మోన్ రాయ్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై సాంఘిక సంస్కరణోద్యమాల్లో భాగస్వామి అయ్యాడు.
-సాలార్‌జంగ్ ఆహ్వానంతో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఇక్కడ సంఘ సంస్కరణోద్యమం చేపట్టడానికి అవకాశం లభించింది.
-హైదరాబాద్‌లో చాలా సామాజిక సంస్థలతో సంబంధాలు కొనసాగించాడు.
-1907లో నిజాం కాలేజీ నుంచి పదవీ విరమణ చేశాడు.
-అఘోరనాథ్ ప్రమేయంవల్ల కులాంతర వివాహాలకు ప్రభుత్వ ఆమోదం లభించింది.
-విద్యాభ్యాసం మాతృభాషలో జరగడం చాలా మంచిదని అభిప్రాయపడ్డాడు.
-అయితే ఈయన సాంఘిక కార్యకలాపాలు తర్వాతి కాలంలో నిజాం ప్రభుత్వానికి నచ్చలేదు. దీంతో ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది.
-హైదరాబాద్‌లో హిందూ, ముస్లిం ఐక్యతకు జాతీయ భావస్ఫూర్తితో పనిచేసిన ముస్లిం మేధావుల్లో ముల్లా అబ్దుల్ ఖయ్యూం ఒకరు.
-ఈయనను గ్రేట్ ముస్లిం, గ్రేట్ ఇండియన్, గ్రేట్‌మ్యాన్‌గా సరోజినీనాయుడు వర్ణించారు.

హైదరాబాద్‌లో స్వదేశీ ఉద్యమం

-స్వదేశీ ఉద్యమానికి ఆర్యసమాజ్, గణేష్ ఉత్సవ సంఘాలు, ఇతర సాంస్కృతిక సంస్థలు తోడ్పడ్డాయి.
-1906-07లో హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సమావేశాలు జరిగి స్వదేశీ ఉద్యమ ప్రచారం జరిగింది. విదేశీ వస్తువులను బహిష్కరించాల్సిందిగా ఈ సమావేశాల్లో ప్రబోధించారు.
-1908లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌ను నిర్బంధించి దేశాంతరవాస శిక్ష అమలుపరచడంతో ప్రజల్లో తీవ్రమైన స్పందన కలిగింది.
-హైదరాబాద్ వార్తా పత్రికలు కూడా బ్రిటిష్ ప్రభుత్వ చర్యను ఖండించాయి.
-మత సంస్కరణలపై శ్రీపాద దామోదర్, సత్యాలేకర్‌ల ఉపన్యాసాలకు ప్రజలు ఆకర్షితులయ్యాయి. స్వదేశీ ఉద్దేశాలు కూడా ఈ ఉపన్యాసాల్లో చోటుచేసుకున్నాయి. అందువల్ల సత్యాలేకర్‌ను హైదరాబాద్ రెసిడెంట్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.

ఖిలాఫత్ ఉద్యమం

-ఇది హైదరాబాద్‌పై ప్రభావం చూపింది. వివేకవర్థిని హైస్కూల్‌లో 1920, మార్చి 16, 20 తేదీల్లో జరిగిన సభల్లో 20 వేలమంది హిందువులు, ముస్లింలు హాజరయ్యారు.
-జనగాం, మెదక్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా సభలు జరగడంతో ఖిలాఫత్ ఉద్యమ ప్రభావం ఎంతుందో అర్థమవుతుంది.
-బారిస్టర్ అస్గర్, అస్కరీ హసన్, ఖరీ ఉజ్జమాన్, మహ్మద్ ముర్తుజా, హుమాయున్ ముర్తుజా, పండిత్ కేశవరావు, రాఘవేంద్రశర్మ మొదలైనవారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
-ముల్లా అబ్దుల్ బాసిత్ ద రెడ్ క్రిసెంట్ సొసైటీ లక్ష రూపాయలకుపైగా చందాలు వసూలు చేసి టర్కీ ప్రధానమంత్రికి పంపించింది.
-అంతేకాకుండా అన్సారీ నాయకత్వంలో ఒక వైద్య బృందాన్ని టర్కీకి పంపడానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చింది.

ఆంధ్రజనసంఘం ఏర్పాటు-నేపథ్యం

-1921, నవంబర్‌లో హైదరాబాద్‌లో వివేకవర్ధిని ఆవరణలో ఒక సంఘ సంస్కరణ సభ ఏర్పాటయ్యింది. అందులో మరాఠీ, కన్నడ, తెలుగు మాట్లాడే జాతీయవాద భావంగల సంఘ సంస్కర్తలు సమావేశమయ్యారు. దీనికి పుణేకు చెందిన కార్వే పండితుడు అధ్యక్షత వహించాడు.
-రెండోరోజు సమావేశంలో ఆంధ్ర, కన్నడ, మరాఠా వ్యక్తులు తమ భాషల్లో ఉపన్యాసమివ్వాలని అప్పటికే నిర్ణయించారు. దీనిప్రకారం ఆ మరుసటి రోజు మాడపాటి హనుమంతరావు తెలుగులో ఉపన్యాసం చేసినప్పుడు మహారాష్ట్ర సభికులు అల్లరి చేశారు. కానీ ఆయన వ్యక్తిత్వ ప్రభావం వల్ల ఎక్కువ గొడవ జరగలేదు.
-కానీ ఆ తర్వాత ఆలంపల్లి వెంకటరామారావు తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టగానే మహారాష్ట్ర యువకులు విపరీతంగా అల్లరిచేసి అవమానపరిచారు. దీంతో తెలుగువారు సభ నుంచి నిష్క్రమించి, ఆ సాయంత్రం వివేకవర్ధిని వెనుక ఉన్న ట్రూప్ బజారులో టేకుల రంగారావు ఇంట్లో సమావేశమయ్యారు.
-1921, నవంబర్ 12న అక్కడ సమావేశమైన మాడపాటి హనుమంతరావు, మందుముల నర్సింగరావు, మందుముల రామచంద్రారావు, మిట్టా లక్ష్మీనరసయ్య, టేకుమాల రంగారావు, బూర్గుల రామకృష్ణారావు మొదలైనవారు నిజాం రాష్ట్ర ఆంధ్రజనసంఘం స్థాపించాలని తీర్మానించారు.
-ఈ సంఘం ప్రధాన లక్ష్యం, ఆంధ్రుల అభివృద్ధికి కృషిచేయడం, అవసరమైన కొత్త సంఘాలు స్థాపించడం, సభలు, సమావేశాలు నిర్వహించడం, ఇతర నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం.
-ఈ సంఘంలో చేరడానికి 18 ఏండ్లు పైబడిన విద్యావంతులు అర్హులు.
-1922, ఫిబ్రవరి 24న ఆంధ్రజనసంఘం మొదటి సమావేశం రెడ్డి హాస్టల్‌లో జరిగింది. తర్వాత మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా ఈ సభ్యులు సమావేశమై సంఘ నియమావళిని అంగీకరించి, కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకున్నారు.
-సంఘం నాయకులు తెలంగాణ గ్రామాలకు వెళ్లి తెలుగువారిని సంఘటితం చేయడానికి ప్రయత్నించారు. ఆంధ్రజనసంఘం స్థాపించిన మరుసటి ఏడాదే దానికి ఉపసంఘంగా ఆంధ్ర పరిశోధక సంఘం ఏర్పాటయ్యింది.
-తెలుగుజాతి సంస్కృతి, చరిత్రను పరిశోధించి, తెలుగు వారి ఔన్నత్యాన్ని తెలియపరిచి, తెలుగువారిని రాజకీయంగా చైతన్యవంతులుగా తీర్చదిద్దడానికి ఈ సంఘం ఉద్దేశింపబడింది.
-తెలంగాణ గ్రామాల్లో పర్యటించి ఊపాటి వెంకట రమణాచార్యులు అనేక తాళపత్ర గ్రంథాలు, శాసన ప్రతులను సేకరించారు.
-తెలంగాణలో బయల్పడిన 123 శాసనాలను తెలంగాణ శాసనాలు అనే పేరుతో ప్రకటించారు.
-ఈ సంఘానికి మొదటి నుంచి మునగాల రాజా నాయని వెంకట రంగారావు అధ్యక్షుడిగా ఉండి ఆర్థిక సహాయం చేశారు.
-ఈ విధంగా ఆంధ్రజనసంఘం స్ఫూర్తితో తెలంగాణలో పలుచోట్ల ఈ సంఘాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిని కలిపి ఒక సమాఖ్యగా ఆంధ్రజనకేంద్ర సంఘం స్థాపించాల్సి వచ్చింది.
-ఈ ఆంధ్రజన కేంద్ర సంఘం మొదటి సమావేశం హన్మకొండలో 1924, ఏప్రిల్ 1న జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, హుజూరాబాద్ నుంచి సభ్యులు పాల్గొన్నారు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.