Type Here to Get Search Results !

Vinays Info

అలంకారములు - Alankaraalu

అలంకారములు రెండు రకాలు అవి

  • శబ్దాలంకారములు 
  • అర్ధాలంకారములు

శబ్దాలంకారములు(toc)

వృత్యానుప్రాసము 

  • ఒకే హల్లు అనేక పర్యాయములు తిరిగి తిరిగి వచ్చినచో అది వృత్తానుప్రాసాలంకారము అనబడును.

ఉదా - అమందా నందంబున గోవిదుడు ఇందిరి మందిరంబు చొచ్చి.

చేకాను ప్రాసము 

  • అర్ధ భేధముతో రెండక్షరముల పదమును వెంటవెంటనే ప్రయేగించును.
  • ఉదా - పాప హరుహరు సేవించెదను.

లాటానుప్రాసము

  • అర్ధమునందుగాక, తాత్పర్యమందునందు మాత్రమే భేదముండునట్లు ఒక పదమును వెంటవెంటనే ప్రయొగించుట.
  • ఉదా - శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ

యమకము

  • అర్ధభేధము గల అక్షరముల సముదాయము మరల మరల ఉచ్చరింపబడినచో యమకమగును.
  • ఉదా - లేమ దనుజులగెలువగా లేమా

ముక్తపద గ్రస్తము

  • పాదము చివరనుండు పదముతో తరువాత పదమును ప్రారంభించుట.

అర్ధాలంకారములు

ఉపమాలంకారము 

  • ఉపమాన ఉపమేయాలకు గల పోలికను మనోహరముగా వర్ణించును.

ఉత్ప్రేక్షాలంకారము
  • ఉపమేయమును ఊహించుటను ఉత్ప్రేక్షాలంకారము అందురు.
  • ఉదా - ఆ వచ్చుచున్న ఏనుగునడగొండమేమో అనునట్లున్నది.

రూపకాలంకారము

  • ఉపమాన, ఉపమేయములకు భేధమున్నను అభేధము చెప్పుటను రూపకాలంకారము అందురు.
  • ఉదా - సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము

శ్లేషాలంకారము 

  • అనేక అర్ధములు వచ్చునట్లు చెప్పుట శ్లేషాలంకారము.
  • ఉదా - రాజు కవలయానందకరుడు.

అర్ధాంతరన్యాసము

  • సామాన్యమును విశేషము చేతను,విశేషమును సామాన్యము చేతను సమర్ధించుట.
  • ఉదా - మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది.

అతిశయోక్తి

  • ఒక విషయము ఉన్నదానికంటే అధికము చేసి వర్ణించుట.
  • ఉదా - ఊరియందలి భవనములు ఆకాశమును అంటుసున్నవి.

దృష్టాంతము

  • ఉపమాన ఉపమేయములకు, బింబ ప్రతిబింబ భావము ఉండునట్లు వర్ణించుట.
  • ఉదా- ఓరాజా నీవే కీర్తిమంతుడవు.

స్వభావోక్తి

  • జాతి గుణజ్రియాదులలోని స్వభావము ఉన్నదున్నట్లు మనోహరముగా వర్ణించుట.
  • ఉదా - అరణ్యమునందు లేళ్లు బెదురు చూపులతో చెంగు చెంగున దుముకుచు పరిగెడుతున్నవి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section