Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ ప్రభుత్వ పథకాలు - వాటిని ప్రారంభించిన తేదీలు

 కల్యాణలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?     - 2014, అక్టోబర్ 2

💥 కల్యాణలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులకు వివాహ సమయంలో అందించే ఆర్థిక సహాయం?    - రూ. 51,000

💥 కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ యువతులకు కూడా వివాహ సమయంలో ఆర్థిక సహాయాన్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు?

 - 2016 ఏప్రిల్ 1

💥 కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే సంబంధిత యువతుల తల్లిదండ్రుల వార్షికాదాయం ఎంతకు మించరాదు?

 - రూ.2 లక్షలు

💥 షాదీ ముబారక్ పథకం ఉద్దేశం?  

      - పేద ముస్లిం యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించడం

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?    - మహబూబ్‌నగర్ జిల్లా

 షాద్‌నగర్ నియోజకవర్గంలోని

 కొత్తూరు గ్రామంలో

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    - 2014, నవంబర్ 8

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు?     - తెలంగాణ ముఖ్యమంత్రి

 కె.చంద్రశేఖర్‌రావు

💥 ‘ఆసరా’ పింఛన్ పథకం కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసింది?     - రూ.4,700 కోట్లు


💥 తెలంగాణలో ‘ఆసరా’ పింఛన్ పథకం కింద ఎంత మంది లబ్ధి పొందుతున్నారు?

 - 37,65,304 మంది


💥 వృద్ధులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - రక్షణ


💥 వితంతువులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?

 - జీవనాధారం


💥 చేనేత కార్మికులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?

 - చేయూత


💥 కల్లుగీత కార్మికులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?

  - ఆలంబన


💥 ఎయిడ్‌‌స బాధితులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - భరోసా


💥 వికలాంగులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?      

 - భద్రత


💥 ‘ఆసరా’ పింఛన్ పథకంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్‌‌స బాధితులు ప్రతి నెలా ఎంత మొత్తం పొందుతున్నారు?

 - రూ.1000


💥 వికలాంగులకు ప్రతి నెలా ఇచ్చే ‘ఆసరా’ పింఛన్ ఎంత?     - రూ.1500


💥 ప్రస్తుతం ‘ఆరోగ్య లక్ష్మి’గా పేర్కొంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు?

 - ఇందిరమ్మ అమృత హస్తం


💥 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1


💥 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఏ కేంద్రాల ద్వారా అమలుచేస్తున్నారు?     - అంగన్‌వాడీ కేంద్రాలు


💥 బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందించేందుకు ఉద్దేశిం చిన పథకం?     - ఆరోగ్యలక్ష్మి


💥 గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, ఆగస్టు 17


💥 గ్రామజ్యోతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - గంగదేవిపల్లి (వరంగల్ జిల్లా)


💥 మన ఊరు-మన ప్రణాళికకు కొనసాగింపుగా రూపకల్పన చేసిన పథకం?    - గ్రామజ్యోతి


💥గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామీణాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు?

 - 7 కమిటీలు. అవి.. పారిశుద్ధ్యం-తాగునీరు కమిటీ; ఆరోగ్యం-పోషకాహారం కమిటీ; విద్యా కమిటీ; సామాజిక, పేదరిక నిర్మూలనా కమిటీ; మౌలిక సదుపాయాల కల్పన కమిటీ; సహజ వనరుల నిర్వహణ కమిటీ; వ్యవసాయ కమిటీ


💥 మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్  ఆర్థిక సాయంతో హరే రామ హరే కృష్ట ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు?     - సద్దిమూట, భోజనామృతం


💥సద్దిమూట పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2014, అక్టోబర్ 13


💥 సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - సిద్దిపేట మార్కెట్ యార్‌‌డ


💥సద్దిమూట పథకం ఉద్దేశం?  

 - మార్కెట్ యార్డులో రైతులు, హమాలీలకు రూ.5కే భోజనం అందించడం


💥 భోజనామృతం కార్యక్రమ ఉద్దేశం?

 - మాతా శిశు సంరక్షణ,

 ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు

 ఉచితంగా భోజనం అందించడం


💥 హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ).. పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి, అడ్డా కూలీలకు ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభిం చింది?     - 2014, జూలై 17


💥 ఎవరి సాయంతో జీహెచ్‌ఎంసీ ఈ భోజన పథకాన్ని  ప్రారంభించింది?

 - అక్షయపాత్ర ఫౌండే షన్


💥 ఆహార భద్రత పథకం లబ్ధిదారులను ఏ సర్వే ఆధారంగా గుర్తించారు?

 - సమగ్ర కుటుంబ సర్వే


💥 ఆహార భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1


💥 ఆహార భద్రత పథకం కింద కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు?     - రూ.1కి కిలో చొప్పున 6 కిలోలు


💥నిరుపేద విద్యార్థులకు సన్న బియ్యం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

 - 2015, జనవరి 1


💥‘మన ఊరు-మన చెరువు’ నినాదంతో రూపకల్పన చేసినకార్యక్రమం?

 - మిషన్ కాకతీయ


💥 మిషన్ కాకతీయ పైలాన్‌ను తెలంగాణ  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎక్కడ ఆవిష్కరించారు? - నిజామాబాద్ జిల్లా

 సదాశివ నగర్ మండలం పాతచెరువు


💥 మిషన్ కాకతీయ ప్రధానోద్దేశం?

 - రాష్ర్టంలోని 46,000 చెరువుల పునరుద్ధరణ


💥 మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, మార్చి 12


💥మహిళలకు రక్షణ అందించేందుకు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రారంభించిన బృందాలు? - షీ టీమ్స్


💥 షీ టీమ్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు?

 - 2014, అక్టోబర్ 24


💥 హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?     - 33%


💥 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూలై


💥 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - చిలుకూరు

 బాలాజీ టెంపుల్ వద్ద (రంగారెడ్డి జిల్లా)


💥 తొలి విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?    - 40 కోట్ల మొక్కలు


💥 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    - 2016, జూలై 8


💥 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?

 - గుండ్రాంపల్లి (నల్గొండ జిల్లా)


💥 రెండో విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?    - 46 కోట్ల మొక్కలు


💥 వాటర్‌గ్రిడ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూన్ 8


💥 వాటర్‌గ్రిడ్ పథకం ముఖ్యోద్దేశం?  

 - ప్రతి ఇంటికి నల్లాల ద్వారా

 మంచి నీటిని అందించడం


💥 వాటర్‌గ్రిడ్ పథకం పేరు?  

 - మిషన్ భగీరథ (2015 డిసెంబర్ 4)


💥 ‘పల్లె వాకిట్లో పౌర సేవలు’ నినాదంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం?

 - పల్లె సమగ్ర సేవా కేంద్రం


💥 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

 - 2015, అక్టోబర్ 2


💥 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?- బీబీనగర్ గ్రామం, దోమకొండ మండలం, నిజామాబాద్ జిల్లా


💥 ఏ పథకంలో భాగంగా వాటర్‌గ్రిడ్ పైపులతో పాటు ఆప్టికల్ ఫైబర్‌ను వేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు?    - డిజిటల్ తెలంగాణ


💥 డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూలై 1


💥 తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? - కౌడిపల్లి (మెదక్ జిల్లా)

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section