Type Here to Get Search Results !

Vinays Info

భక్తీ శతకములు

భక్తి శతకాలు: భక్తి సంబంధమైన శతకాలు. వీటిని శైవ, వైష్ణవ, దేవి, వివిధ దేవతా సంబంధ శతకాలుగా వర్గీకరించారు.
ఎ)శైవమత సంబంధమైనవి - శివుని గురించి స్తుతిస్తూ రాసిన శతకాలు. అవి:
-శివతత సారం - మల్లికార్జున పండితుడు
-వృషాధిప శతకం - పాల్కురికి సోమనాథుడు
-సర్వేశ్వర శతకం - యధావాక్కుల అన్నమయ్య
-శ్రీ కాళహస్తీశ్వర శతకం - ధూర్జటి
-విశ్వనాథ శతకం - అమలాపురపు సన్యాస కవి
-రాజశేఖర శతకం - సత్యవోలు సోమసుందర కవి
-భక్త చింతామణి - కూచిమంచి సోమసుందర కవి
-మృత్యుంజయ శతకం - తెన్నేటి నారాయణ శర్మ

బి)వైష్ణవ మత సంబంధమైనవి - విష్ణువును లేదా ఆయన అవతారాలను గురించి స్తుతిస్తూ రాసిన శతకాలు.అవి:
-నారాయణ శతకం - బమ్మెర పోతన (వైష్ణవ మత సంబంధ శతకాల్లో మొదటిది)
-వీర నారాయణ శతకం - రావూరి సంజీవ కవి
-మనసా హరిపాదములాశ్రయింపుమా - తాడేపల్లి పానకాలరాయ కవి
-నారసింహ శతకం - కాకుత్సల శేషప్ప కవి
-వేదనా శతకం, విభూతి శతకం - పుట్టపర్తి నారాయణాచార్యులు
-దాశరథి శతకం - కంచర్ల గోపన్న
-కృష్ణ శతకం (అలభ్యం) - తిక్కన
-రఘునాథ శతకం - పుష్పగిరి తిమ్మకవి

సి)దేవీ సంబంధ శతకాలు - లక్ష్మి, పార్వతి, సరస్వతులను స్తుతిస్తూ రాసిన శతకాలు. అవి:
-సరస్వతి శతకం - వెండిగంటం గురునాథ శర్మ
-శారదా శతకం - భమిడిపాటి రామమూర్తి
-లక్ష్మీ శతకం - పరవస్తు మునినాథ కవి
-మహిషాసుర మర్ధిని శతకం - దిట్టకవి రామచంద్ర కవి

వివిధ భక్తి శతకాలు - వివిధ దేవతలను గురించి స్తుతిస్తూ రాసిన శతకాలు. అవి:
-విశ్వనాథ మధ్యాక్కరలు- విశ్వనాథ సత్యనారాయణ
-భక్త చింతామణి శతకం - వడ్డాది సుబ్బరాయ కవి
-సూర్యనారాయణ శతకం - ఆదిభట్ల నారాయణదాసు
-వీరబ్రహ్మంగారి శతకం - బొద్దోజు త్రిపురాంతకాచార్యులు
-శ్రీ మలయాళ సద్గురు శతకం - సముద్రాల లక్ష్మయ్య
-మాతృ శతకం - దువ్వూరి రామిరెడ్డి

2. వ్యాజస్తుతి శతకాలు: పైకి నిందగా కనిపిస్తూ లోన పొగడ్త కలిగిన శతకాలు. అవి:
-సింహాద్రి నారసింహ శతకం - గోగులపాటి కూర్మనాథుడు. (వ్యాజస్తుతి శతకాల్లో మొదటిది)
-భద్రగిరి శతకం - భల్లా పేరయ్య
-ఆంధ్రనాయక శతకం - కాసుల పురుషోత్తమ కవి
-హంసలదీవి వేణుగోపాల శతకం - కాసుల పురుషోత్తమ కవి

3.వేదాంత శతకాలు: ఆధ్యాత్మిక సంబంధ విషయాలతో కూడిన శతకాలు. అవి:
-శివముకుంద శతకం- పరమానంద యతి
-సంపంగిమన్న శతకం - పరమానంద యతి
-స్వప్రకాశ శతకం - ఎడ్ల రామదాసు
-అఖిల రూపాత్మక శతకం - ఎడ్ల రామదాసు
-రామరామ శతకం - తోట నర్సింహ కవి
-ఆత్మారామ గోవింద శతకం - పరశురామ పంతులు
-భద్రాద్రి రామ శతకం - పరశురామ పంతులు
-మానస బోధ, చిత్త బోధ శతకాలు - తాడేపల్లి పానకాలరాయ కవి
-సాక్షిలింగ శతకం - కొప్పు ఆదినారాయణ
-పరమపద పరిపూర్ణ శతకం - భళ్లా వెంకయ్య
-పరమపురుష శతకం - పోలూరి పాపయ కవి
-సంగమేశ శతకం - డా. కృష్ణ కౌండిన్య
-చిత్త శతకం - శ్రీపతి భాస్కర కవి

నీతి శతకాలు: నైతిక విలువల గురించి ప్రబోధిస్తూ రాసిన శతకాలు. అవి:
-సుమతీ శతకం - బద్దెన (నీతి శతకాల్లో మొదటిది)
-భాస్కర శతకం - మారద వెంకయ్య (మారవి)
-కుమార శతకం - ఫక్కి అప్పల నరసింహ
-కుమారీ శతకం - తోట వెంకటనర్సయ్య
-వేంకటేశ్వర శతకం - తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
-కుమతి శతకం - కే నారాయణరావు

మాదిరి ప్రశ్నలు
1. ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా అని బాధపడిన కవి? (2)
1) రామరాజ భూషణుడు
2) చేమకూర వేంకట కవి
3) నంది తిమ్మన 4) పింగళి సూరన

2. ప్రబంధ వాజ్మయం పరిశోధనా గ్రంథ రచయిత ఎవరు? (4)
1) వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి
2) పుట్టపర్తి నారాయణాచార్యులు
3) వెల్దండ ప్రభాకరామాత్య
4) డా. పల్లా దుర్గయ్య

3. తెలుగులో సంపూర్ణ లక్షణాలుగల తొలి శతకం ఏది? (1)
1) వృషాధిప శతకం 2) శివతత్త సారం
3) సుమతీ శతకం 4) సర్వేశ్వర శతకం

4. తెలుగులో తొలి నీతి శతకం? (3)
1) భాస్కర శతకం 2) కుమార శతకం
3) సుమతీ శతకం 4) కుమారీ శతకం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section