శతక వాజ్మయంపై పరిశోధన చేసినవారు?
1. ఎం. కులశేఖరరావు
2. నిడదవోలు వెంకటరావు
3. కె.గోపాల కృష్ణారావు
4. ఆరుద్ర
2. ఏకపాద మకుటం గల శతకం?
1. భాస్కరశతకం 2. దాశరధీశతకం
3. నారాయణశతకం 4. వేమన శతకం
3. శతకంలో ఏది ఉండదు?
1. ఒకే మకుటం 2. కథ, రసం
3. ఆత్మ శ్రయత్వం 4. అన్నీ
4. ధూర్జటి శతకంలో
1. రాజనింద ఉంది 2. భక్తి ఉంది
3. ఆత్మాశ్రయం ఉంది. 4. అన్నీ
5. తెలుగులో తొలి శతకం?
1. వృషాధిపశతకం 2. సుమతీశతకం
3. భర్తృహరి సుభాషితాలు 4. కృష్ణ శతకం
6. సర్వేశ్వర శతకం రచించినది?
1. పాల్కురికి సోమన
2. మల్లికార్జున పండితారాధ్యుడు
3. యథాహక్కుల అన్నమయ
4. నాచన సోమన
7. 'శ్రీరాముని దయచేతను....'' అని ప్రారంభించి బడినది?
1. దాశరధీ శతకం 2. సుమతీ శతకం
3. కృష్ణ శతకం 4. ఆంధ్ర నాయకశతకం
8. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా...'' అన్న శతక కవి?
1. పోతన 2. ధూర్జటి
3. బద్దెన 4. వేమన
9. వేమన పద్యాలు మొదట ప్రచురించినది?
1. సి.పి.బ్రౌన్ 2. రాళ్లపల్లి
3. క్యాంప్‌బెల్ 4. కట్టమంచి రామలింగారెడ్డి
10. ''గాయపు మందు కత్తికే పూసి కొట్నినట్లు తిట్టుచునే నవ్వించు హాస్యకుశలత వేమన సొత్తు'' అన్నవారు?
1. ఆరుద్ర 2. రాళ్లపల్లి
3. ఎన్.గోపి 4. కోదండరామిరెడ్డి
11. వేమన?
1. భక్తకవి 2. వైరాగ్య కవి
3. అధిక్షేపకవి 4. సంఘసంస్కర్త
12. పిల్లీ శతకం రాసినవారు?
1. శ్రీశ్రీ 2. బోయిభీమన్న
3. ఆరుద్ర 4. దాశరథి
13. ఆంధ్రనాయక శతకం
1. వ్యాజస్తుతిశతకం 2. అన్యాపదేశ శతకం
3. అనువాద శతకం 4. ఏదీకాదు
14. కుసుమ ధర్మన్న కవి రచించింది?
1. చీపురుకట్ట శతకం 2. భారతీ శతకం
3. హరిజన శతకం 4. మాతృ శతకం
15. కింది వానిలో పేరడీ శతకం?
1. అభినవ వేమన శతకం 2. దాశరథీ శతకం
3. టెంకాయ చిప్ప శతకం 4. అన్నీ
16. అశ్లీలం, తిట్లు గలది?
1. పిల్లీ శతకం 2. కవి చౌడప్ప శతకం
3. చీపురుకట్ట శతకం 4. పకోడీ శతకం
17. సిరిసిరి మువ్వ శతకంలోని ఛందస్సు?
1. ఆటవెలది 2. తేటగీతి
3. కందం 4. వృక్షం
18. 'రాజులుమత్తులు వారి సేవనరక ప్రాయంబు...'' అన్న కవి?
1. వేమన 2. బద్దెన
3. రామదాసు 4.ధూర్జటి
19. శతక కవుల చరిత్ర రాసిన వారు?
1. వంగూరి సుబ్బారావు
2. గోపాలకృష్ణారావు
3. బండారు తమ్మయ్య
4. ఎవరూ కాదు.
20. మాతృ శతకం రాసినవారు?
1. శ్రీశ్రీ 2. విశ్వనాథ
3. రాయప్రోలు 4. దువ్వూరి రామిరెడ్డి
సమాధానాలు
1. 3 2.4 3.2 4.4 5.1 6.3 7.2 8.4 9.1 10.2
11.4 12.2 13.1 14.3 15.1 16.2 17.3 18.4 19.1 20. 4