Type Here to Get Search Results !

Vinays Info

శతకము

శతకం
- శతకం అంటే నూరు పద్యాలు గల రచన అని అర్థం.

శతకం లక్షణాలు
1. సంఖ్యానియమం ఉండటం : సాధారణంగా శతకాల్లో 108 పద్యాలు ఉంటాయి.
2. మకుట నియమం ఉండటం : మకుటం అంటే కిరీటం అని అర్థం. రాజుకు కిరీటం ఎంత ప్రధానమైనదో శతకానికి మకుటం అంత ప్రధానమైనది. మకుటాలు నాలుగు విధాలుగా ఉంటాయి. అవి.
- 1. ఏకపద మకుటం - ఒకే పదం మకుటంగా ఉండుట.
ఉదా : సుమతీ శతకంలో సుమతీ, భాస్కర శతకంలో భాస్కరా, కుమార శతకంలో కుమారా, కుమారీ శతకంలో కుమారీ మొదలైనవి ఏకపద మకుటాలు.
- 2. అర్ధపాద మకుటం : సుమారు అర్ధపాదం మకుటంగా ఉండుట.
ఉదా : వృషాధిప శతకంలో బసవాబసవా వృషాధిపా, దాశరథీ శతకంలో దాశరథీ కరుణాపయోనిధీ. సిరిసిరిమువ్వ శతకంలో సిరిసిరిమువ్వ మొదలైనవి అర్ధపాద మకుటాలు
- 3. ఏకపాద మకుటం : ఒకపాదం మకుటంగా ఉండుట.
ఉదా : వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ, కాళికాంబ శతకంలో కాళికాంబ హంసకాళికాంబ, సంగమేశ శతకంలో శరణు సంగమేశ శరణు శరణు మొదలైనవి ఏకపాద మకుటాలు.
- 4. ద్విపాద మకుటం : రెండు పాదాలు మకుటంగా ఉండుట
ఉదా : నరసింహ శతకంలో భూషణ వికాస శ్రీధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురితదూర, శ్రీనివాస శతకంలో సప్తగిరివాస కలియుగ సాధుపోష, శిష్ట రక్షక తిరుమల శ్రీనివాస, ఆంధ్రనాయక శతకంలో చిత్రచిత్ర ప్రభావ దక్షిణ్యభావ, హతవిమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ మొదలైనవి ద్విపాద మకుటాలు.
- సాధారణంగా మకుటం పద్యం చివరలో ఉంటుంది. కానీ చిదంబర శాస్త్రి రచించిన దారుణ శతకంలో పద్యం మొదట ఉంటుంది.
- ఛందోనియమం ఉండటం : ఏదో ఒక ఛందస్సులోనే శతకం ఉంటుంది. కానీ వృత్త పద్యాల్లోనైతే ఉత్పలమాల, చంపకమాలల్లో లేదా శార్ధూలం, మత్తేభంలో శతకం రాసే సౌలభ్యం ఉంది.
4. ముక్తకాలుగా ఉండటం: శతకంలోని పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. ముక్తకం అంటే ఒక పద్యానికి మరో పద్యానికి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండటం.
5. ఆత్మాశ్రయత్వం కలిగి ఉండటం : సాధారణంగా శతకాలు ఆత్మాశ్రయ ధోరణిలో ఉంటాయి.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. ఆత్మాశ్రయత్వం అంటే ఏమిటి?

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Ads Section