Type Here to Get Search Results !

Vinays Info

వర్షం ఎక్కడి నుండి వస్తుంది(Rain: Where Does it come from)

వర్షం ఎక్కడి నుండి వస్తుంది(Rain: Where Does it come from)

  • నీరు మూడు రూపాలలో లభిస్తుంది.

  1. ఘనరూపం
  2. ద్రవరూపం
  3. వాయురూపం
వర్షం ఎక్కడి నుండి వస్తుంది(Rain: Where Does it come from)
Water Cycle - 6th Class General Science 
  • వాన చినుకులు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయణిస్తాయి.
  • నీటి ఆవిరి - వాయురూపం
  • నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియనే - భాష్పీభవనం(ఇగురుట) అంటారు.
  • వాన చినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నప్పటికీ గుండ్రంగా ఉండదు. మేఘంలోంచి జారీ పడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది.
  • నీళ్ళు గ్రహించే ఉష్ణ పరిమాణం భాష్పీభవనం(ఇగురుట)ను ప్రభావితం చేస్తుంది.
  • సాంద్రీకరణం - నీటి ఆవిరి నీరుగా మరే ప్రక్రియనే సాంద్రీకరణం అని అంటారు.
  • వాన చినుకులు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటాయి.
  • భూతలం నుంచి పైకి వెల్లేకొలది గాలి చల్లబడుతుంది.
  • ఈజిప్టు దేశస్థులు ఎండ నుండి కాపాడుకోవడం కోసం గోడుగును రూపొందించారు.
  • మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టంబర్ వరకు వర్షాలు కురుస్తాయి.
  • నైఋతి రుతుపవాలు - నైరుతి మూల నుండి వీస్తాయి.
  • పరిశ్రమల నుండి, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్ లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్లా వర్షాలు(Acid Rains) కురుస్తాయి.
  • భాష్పీభవనం, సాంద్రీకరణం ప్రకృతిలో నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి.
  • వర్షపు చినుకులు చాలా చిన్నవిగా ఉంటే వాటిని సమిష్టిగా వర్షపు తుంపర అని అంటారు.
  • ప్రతిరోజూ వర్షం కురిసే భూమధ్యరేఖ ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి.
  • భూమిపై నీరు మూడు రూపాలలో లభిస్తుంది. మంచు(ఘనరూపం), నీరు (ద్రవరూపం), నీటి ఆవిరి (వాయురూపం).
  • నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనమంటారు. మేఘాలన్నీ వర్షాలనివ్వవు.
  • నీటిని ఎక్కువ వేడిచేస్తే అది త్వరగా బాష్పీభవనం(ఇగరడం) చెందుతుంది.
  • నీటి ఆవిరితో కూడిన సూక్ష్మబిందువులతో ఏర్పడేదే మేఘం.
  • సముద్రాలు, సరస్సులు, చెరువులు మొదలగువాని ఉపరితలాల నుండి నీరు బాష్పీభనం (ఇగరడం) చెందటం మేఘాలు ఏర్పడటానికి దోహదపడుతుంది. 
  • భూతలం నుంచి పైకిపోయినప్పుడు, గాలి చల్లబడుతుంది.
  • నీటి బాష్పీభవనం, సాంద్రీకరణాల పరంపర భూమిపై వర్షం పడేందుకు కారణమవుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section