అయస్కాంతాలతో ఆటలు(Playing With Magnets) | 6th Class General Science| VinaysInfo
- ఇప్పటివరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం అనేది బలమైన అయస్కాంతం.
- అయస్కాంతం కథ :సుమారు 2500 సం॥ల క్రితం “మాగ్నస్” అనే గొర్రెల కాపరి రోజూ తన గొర్రెలను మేపుతూ కొండలలో తిరుగుతుండేవాడు. అతని చేతికర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది. ఒకరోజు అతని గొర్రెలు మేస్తూ ఉంటే అతను ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చుని ఆ కుంటలోని నీళ్ల అడుగున కనబడే గులకరాళ్లను తన కర్రతో అటూ ఇటూ కదిలిస్తున్నాడు. అప్పుడు ఆ కర్ర అడుగు భాగాన గల ఇనుప తొడుగుకి ఏదో అంటుకున్నట్లు అనిపించింది. బయటికి తీసిచూసాడు. ఒక రాయి అంటుకుని ఉంది.
- ఆ రాయి సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను “లోడ్ స్టోన్స్" అని అంటాం.
▪️ మగ్నస్ అనే గొర్రెల కాపరి(సుమారు 2500 సంత్సరాల క్రితం)
▪️ రాయి ఒక సహజ అయస్కాంతం. అటువంటి రాళ్ళను లోడ్ స్టోన్ (Load Stones) అని అంటారు.
- వివిధ ఆకారాలలో ఉన్న అయస్కాంతాలు.
- సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు.
- అయస్కాంతం ఆకర్షించే పదార్దాలను - అయస్కాంత పదార్థాలు (Magnetic Materials) అని అంటారు.
- అయస్కాంతం ఆకర్షించని పదార్దాలను - అనయస్కాంత పదార్థాలు (Non Magnetic Materials) అని అంటారు.
- పూర్వం శత్రువుల నౌకల నుంచి సీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు.
- అయస్కాంత ఆకర్షించే లక్షణం - దాని రెండు కొనలల్లో అధికంగా ఉంటుంది. ఈ రెండు కొనలను అయస్కాంత ధృవాలు అని అంటారు.
- ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుదయస్కాంతాన్ని తయారు చేస్తారు.
- స్వేచ్చగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర - దక్షిణ దిక్కులను సూచిస్తుంది. దీనినే అయస్కాంత దిషాధర్మం(Directional Property)అని అంటారు. దీని ఆధారంగానే అయస్కాంత దిక్సూచి తయారు చేస్తారు.
- అయస్కాంత దిక్సూచి వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచరాదు.
- జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు.
- సజాతి ధృవాలు(N-N, S-S) వికర్షించుకుంటాయి. విజాతి ధృవాలు(N-S) ఆకర్షించుకుంటాయి.
- సాధారణంగా అయస్కాంతాలు ఇనుమును లేదా ఉక్కుతో తయారు చేస్తారు.
- భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది.
- ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నపుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ (🧲 Induction) అంటారు.
- లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతం.
- భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రతకన్నా 20రెట్లు శక్తివతమైనది.