Type Here to Get Search Results !

Vinays Info

మన ఆహారం(Our Food)

1. మన ఆహారం(Our Food) - 6th Class General Science| Vinays Info 

మన ఆహారం(Our Food) - 6th Class General Science| Vinays Info

▪️ అరటిపండులో మన శరీరానికి అవసమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది.

▪️ ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు.దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులున్న పదార్థంతో కలిపి తినాలి.

▪️ ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్దాలను దినుసులు అని అంటారు.

▪️ చికొరి జీర్ణవ్యవస్థకు, రక్తప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది.

▪️ మేకలు, గొర్రెల నుండి - పాలు, మాంసం లభిస్తుంది.

▪️ కోళ్లు, బాతులు నుండి - మాంసంతో పాటు గుడ్లు కూడా లభిస్తాయి.

▪️ మొక్కలలో ఆకులు - పాలకూర, కొత్తిమీర

▪️ మొక్కలలోని పువ్వులు - గోభి (క్యాబేజీ)

▪️ మొక్కలో కాయలు - టమాట, మునగా

▪️ ఉప్పు ఒక ఖనిజం(సముద్రం నుండి లభిస్తుంది).

▪️ బీట్రూట్ లో పిండిపదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని తరచుగా తినాలి.

▪️ బిర్యానీ దినుసులు : ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరయాలు. వీటిని సుగంధ ద్రవ్యాలు అని అంటారు.

▪️ ఎండిన పండు(Dry Fruits) - జీడిపప్పు, బాదం, కిస్ మిస్

▪️ వేరుశనగలో మాంసకృత్తులు సమృద్దిగా ఉంటాయి. అయితే ఇవి కొందరిలో అలర్జిని కలిగిస్తాయి.

▪️ రాజస్థాన్ లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి.

▪️ ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల నుండి కాపాడే పదార్థాలు. వీటిని యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలున్నాయి.

ఆహారం చేయడంలోని పద్దతులు : 

  1. ఉడికించడం(Boiling)
  2. ఆవిరిలో ఉడికించడం(Steaming)
  3. పులియబెట్టడం (Fermentation)
  4. వేయించడం (Roasting)
  5. ఎక్కువ నూనెలో వేయించడం (Deep Frying)
  6. తక్కువ నూనెలో వేయించడం (Shallow Frying)
  7. చాపింగ్ మరియు మిక్సింగ్ (Choping &Mixing)
  8. కటింగ్ & మిక్సింగ్ (Cutting & Mixing) 

▪️ చిలగడ దుంపలో రక్తాన్ని శుద్ధిచేసే పదార్థాలు (కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్) ఉంటాయి.

▪️ పచ్చళ్లు నిలువ చేయడానికి ఉప్పు, కారం, నూనె, పసుపు పొడిని ఉపయోగిస్తారు.

▪️ చేపలు నిల్వ చేయడం - పొగ బెట్టడం (తంపట విధానం) ద్వారా నిల్వ చేస్తారు.

▪️ చక్కెర పాకం, తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు.

▪️ టమోటో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. ఇది విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని కలిగిస్తుంది.

▪️ పండ్లు కూరగాయలు ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను తయారు చేయడం - దీనిని వెజిటబుల్ కార్వింగ్ అంటారు.

▪️ మొక్కలు, జంతువుల నుండి మనకు ఆహారం లభిస్తుంది.

▪️ టమోటాలో కెరోటినాయిడ్స్ మరియు లైకనోపిన్ లు సమృద్దిగా ఉంటాయి.

▪️ కెరోటినాయిడ్స్ అధికంగా గల ఆహార పదార్దాలను తినడం ద్వారా కాన్సర్ కు గురయ్యే ప్రమాదం తగ్గును.

▪️ ఆహార పదార్థాలను నిలువ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section