Type Here to Get Search Results !

Vinays Info

ఉపవాచక బోధన(Methods of Teaching Non Detailed Text) Telugu Methodology

ఉపవాచక బోధన(Methods of Teaching Non Detailed Text) Telugu Methodology

  • దీనికే పూరణ వాచకం (లేదా) గౌణ వాచకం, విస్తార పఠన వాచకం, స్వయం అధ్యయన వాచకం, సహాయ వాచకం, సెకండరీ రీడర్ అనే పేర్లు కలవు.

ఉపవాచక బోధన ముఖ్య ఉద్దేశం:

  • విస్తార పఠనం, స్వయం అధ్యయనం, ఆత్మ విశ్వాసం, మౌన పఠనం, విరామకాల సద్వినియోగం.
  • స్వీయ అభ్యసన శక్తిని విద్యార్థులకు కలుగజేస్తుంది.
  • ప్రధానంగా ఉపవాచకాలు 6వ తరగతి నుంచి ప్రవేశపెడతారు. - ద్వితీయ భాషగా తెలుగు చదివేవారికి 8వ తరగతి నుండి ప్రవేశపెడతారు.
  • ప్రాథమిక తరగతులలో 'కథా వాచకాలు' (విస్తార పఠనం కొరకు) ఉండేవి. ప్రస్తుతం 'చదువు ఆనందించు' అనే పేరుతో పాఠ్యాంశ బోధనలో పుస్తకాల్లో ప్రవేశపెట్టారు.
  • 10వ తరగతి చదివేవాని ఉపకవాచకం 8వ తరగతి స్థాయిలో ఉండాలి.
  • వ్యాకరణాంశాలు ఉండకూడదు, భాష సరళంగా ఉండాలి.
  • 6, 7 తరగతులలో చారిత్రక, అద్భుత కథలను పరిచయం చేయాలి.
  • 8, 9లలో జీవిత చరిత్రలు, 10వ తరగతిలో ఏకాంశంగా ఉండే విషయాన్ని ప్రవేశపెట్టారు.
  • ఉపవాచకంలో పేజీల సంఖ్య - 100 నుండి 120.
  • ఉపవాచకంలో పీరియడ్లు గరిష్టంగా 20 వాడాలి.

ఉపవాచక బోధనా పద్ధతులు

1) కథాకథన పద్ధతి :

2) చర్చా పద్ధతి :

  • చర్చ పెట్టబోయే ముందు ఉపాధ్యాయుడు చదువుకుని రమ్మని సూచన చేయాలి. ఆ తర్వాత ప్రశ్నోత్తర పద్ధతిలో చర్చను జరిపించాలి.

3) పఠన పద్ధతి :

4) ఉపన్యాస పద్ధతి :

5) పరిశోధనా పద్ధతి :

  • దీనికే ‘స్వయం అధ్యయన పద్ధతి' అని పేరు.
  • ఇది ‘ఉత్తమమైనది'.
  • విద్యార్థుల యొక్క స్వయంకృషిపై ఆధారపడి ఉంటుంది.
  • నిఘంటువులను, పూర్వ గాథలను విద్యార్థి అభ్యసిస్తూ విషయాన్ని తెలుసుకోవడం.
  • ఇది ఉన్నతస్థాయికి మాత్రమే పరిమితం.

6) నియోజన పధ్ధతి :

  • తరగతిలో బోధించిన (లేదా) బోధించే విషయంపై అనేకమైన ప్రశ్నలిచ్చి సమాధానాలు రాయించడం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section