కాపీ రైటింగ్ : మేలు పంక్తి' లేదా 'ఆదర్శపంక్తి(Copy Writing)
- ఈ పుస్తకాలలో మొదట ఉపాధ్యాయుడు స్వదస్తూరితో రాసిన వరసనే 'మేలు పంక్తి' లేదా 'ఆదర్శపంక్తి' అంటారు.
- దానిని ఆధారంగా చేసుకుని విద్యార్థులు రచన చేస్తూ తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. కాబట్టి దీనిని 'మేలుపంక్తి' రచన అంటారు.
- దీనినే 'ఒరవడి రాత' అనీ, తెలంగాణలో 'కరడాలు' రాయడం అనీ అంటారు.
- కాపీరైటింగ్ వలన సమతా లక్షణం విద్యార్థులలో అలవడుతుంది.
- కాపీరైటింగ్ రాసేటప్పుడు కింది నుండి పైకి రాయాలి.
- ఈ పుస్తకాలలో ఉండే నిలువుగీతలు సమతా లక్షణాన్ని కలుగజేస్తాయి.
- చూచిరాతకు, కాపీ రైటింగ్కు ప్రధాన తేడా - అక్షర పరిమాణంలో తేడా అంటారు.