అమ్మ(Amma)
- ప్రక్రియ - గేయం
- ఇతివృత్తం : సంస్కృతి / విలువలు
- కవి :వేముగంటినరసింహ చార్యులు
- మూలం : బాలగేయాలు
- అమ్మ' పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది.
గేయం :
అమ్మ మనకు దైవము రా
అమ్మ ప్రేమ రూపము రా
అమ్మ వంటి దేవత ఈ
అవనిలోన లేదురా
తన రక్తము పోసి మనను
కనిపెంచెనురా!
తీపి కథలు చెప్పి బువ్వ
తీనిపించునురా !
అమ్మ పిలుపు లోన
ఎంతో కమ్మదనం ఉందిరా
అమ్మ పలుకు మాటల్లో
అమృతమే చిందురా !
జోలపాట పాడి
ఉయ్యలలూపురా
లాలి పాట పాడి
నిద్దుర పుచ్చురా
పదాలు :
- పాటలు పాడేవారు – గాయకులు
- కథ చెప్పే వారు – కథకులు
- పుస్తకాలు చదివేవారు –
- చిత్రాలు గీసేవారు – చిత్రకారుడు
- ఆటలు ఆడేవారు – క్రీడాకారులు
- రచనలు చేసేవారు – రచయిత
అర్ధాలు :
- అవని – భూమి
వచనాలు
- దైవం – దైవాలు
- రూపం – రూపాలు
- పలుకు – పలుకులు
- ఉయ్యాల – ఉయ్యాలలు
- పాట – పాటలు
- క, గ , జ, ట, త, ద, డ,ప, బవంటిఅక్షరాలను తేలికగా పలుకుతాం. ఇలా తీరగా పలికే అక్షరాలను అల్ప ప్రాణ అక్షరాలు అంటారు.
- ఖ, ఘ,ఛ,ఝ,ఠ,ఢ,థ,ధ,ఫ,భవంటి అక్షరాలతో ఒత్తి పలుకుతాం ఇలా పలికే వాటిని మహా ప్రాణ అక్షరాలు అంటారు.