Type Here to Get Search Results !

Vinays Info

వర్ణాశ్రమ ధర్మాలు | Varnashrama Dharmas

వర్ణాశ్రమ ధర్మాలు | Varnashrama Dharmas

విద్యార్థి తన జీవితకాలంలోని వివిధ దశలు, వారు చేయాల్సిన ధర్మాలను గురించి వివరిస్తూ 

1) బ్రహ్మచర్యం 

2) గృహస్థాశ్రమం 

3) వానప్రస్థాశ్రమం 

4) సన్యాసం 

అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. 

  • బ్రహ్మచర్య దశలో ప్రతి ఒక్కరు గురుముఖంగా ఉండే విద్య, జ్ఞాన సముపార్జన చేయాలి. 
  • గృహస్థాశ్రమం ప్రకారం మంచి విద్యను పొంది, సముపార్జించిన జ్ఞానంలో ధర్మబద్ధంగా జీవిస్తూ, తన తరవాత మరొకతరాన్ని సమాజానికి అందించడానికి, · వివాహ వ్యవస్థ ద్వారా నియమబద్ధమైన జీవితాన్ని అనుభవించాలి. ఇతరులకు కష్టం కలిగించని రీతిలో ఆనందంగా గడపాలి. 
  • వానప్రస్థం; గృహస్థాశ్రమ ధర్మం అనంతరం ప్రాపంచిక భోగాలకు దూరంగా ఉండి మంచి ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రశాంత వాతావరణంలో గృహస్థాశ్రమ ధర్మం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. 
  • సన్యాసం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమదశ, వాన ప్రస్థదశల అనంతరం తన జీవిత సార్థకతకు 'మోక్షమే' ప్రధాన కాలప్రమాణం. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ భవబంధాలను విడనాడి మోక్షసాధనకై ధర్మప్రచారం చాలి. అరణ్యాలు / ఆశ్రమాల్లో ఆదర్శజీవితం కొనసాగించాలి.

గురుకులాల్లో చేరే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూనే, ఉన్నత వర్గాల పిల్లలకు కౌమారదశలో ‘ఉపనయనం' చేసేవారు. 'ఉప' అనగా సమీప అని, 'నయనం' అనగా నేత్రం / జ్ఞానం అంటే -జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండటం అంటే జ్ఞాన అభ్యసనకు విద్య ప్రారంభంగా చెప్పవచ్చు. సాధారణంగా ఈ కార్యక్రమం బ్రాహ్మణులకు మాత్రమే నిర్వహించేవారు. వారిని ద్విజులు అనేవారు. ద్విజులు అనగా మొదటి జన్మ ప్రకారం 'శరీర ఆకృతి పొందడం' ద్విజన్మ అనగా రెండవసారి జన్మించడం అంటే ఉపనయనం ద్వారా జ్ఞానం పొందడాన్ని మరోజన్మగా చెప్పబడింది. ఆనాటి విద్యాకేంద్రాలు ఆరామాలు, నిహారాలు, విద్యా విజ్ఞాన కేంద్రాలుగా అభివర్ణించబడినాయి. అవే నలంద, తక్షశిల, విక్రమశిల, ఉద్ధాంతపుర మొదలైనవి. జ్ఞాన సముపార్జన కావించి బౌద్ధమత వ్యాప్తికి కృషిచేసి పేరెన్నికగన్నవి. దక్షిణ భారతంలోని కంచిలో ప్రముఖ విద్యాపీఠం వెలసింది. 'బ్రాహ్మణ, వైదికవిద్య', హిందూ సాంప్రదాయ విద్యలు నేర్పబడేవి. వేదాలు, వేదాంగాలు, తత్వశాస్త్రం, వ్యాకరణం, భాష, తర్కం, క్షత్రియోచిత విద్యలు, యుద్ధతంత్రం, చదవడం, రాయడం, అంకగణితం బోధించబడేవి, స్త్రీలు కూడా వేదాలు అధ్యయనం చేసేవారు. కాని తరవాత కాలంలో స్త్రీలు గృహాలకే పరిమితమయ్యారు. ప్రాథమిక స్థాయి విద్యను పొందిన వారిలో కొందరే ఉన్నతస్థాయి విద్యను అభ్యసించడానికి వీలు కలిగేది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section