Type Here to Get Search Results !

Vinays Info

ప్రాచీన కాలపు విద్య | Ancient Education

ప్రాచీన కాలపు విద్య - Ancient education

  • ప్రాచీన విద్య ముఖ్యంగా హరప్పా నాగరికత, మొహంజొదారో: నాగరికత కాలంలో నాటి ప్రజల ఆరాధ్యదైవం 'పశుపతి'. 
  • ఆటవిక జీవితం గడిపే వ్యక్తులను పశువిధానం. నుంచి మేలైన, మెరుగైన జీవిత విధానానికి తీసుకువెళ్లాలనే భావన ఆనాడు కూడా వచ్చింది. 
  • మంచి జీవన విధానానికి ఎంతగానో ఉపకరిస్తుందని భావించారు. అందుకే ఆ కాలంలో ప్రణాళికాబద్ధమైన నగరజీవనం, వాస్తు విధానం, శిల్ప, భవన నిర్మాణం మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది. 
  • ఆనాటి విద్యా విధానాన్ని గమనిస్తే దాదాపు అన్ని వర్గాలకు విద్యను అందించినట్లుగా తెలుస్తున్నది. 
  • మంచివిద్య ద్వారా 'మోక్షం' లేదా ఉజ్వలమైన జీవితం లభిస్తుందని భావించారు. కాని ఇదే సమయంలో వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా వర్ణవ్యవస్థ అంటే నిమ్న వర్ణాలు, అగ్రవర్ణాలు, కులవ్యవస్థకు దారితీసింది. 
  • హిందూ సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా వర్గీకరణ జరిగింది.
ప్రాచీన కాలపు విద్య | Ancient Education
Image: Quora


1) బ్రాహ్మణులు : వేదాలు హిందూమత ధర్మ పురాణాలు, క్రతువులు నిర్వహణ, మతఛాందస భావనలు, హిందూమతం గురించి అధ్యయనం చేసేవారు.

2) క్షత్రియుడు: క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు అనే నానుడి ప్రకారం, దేహదారుఢ్యం, నాయకత్వ లక్షణాలు కలిగినవారు ఎక్కువగా వివిధ రకాల యుద్ధ విద్యలు. అభ్యసించేవారు. పూర్వకాలపు రథగజతురగ పద్ధతి బలాలచే విద్యతోపాటు అనేక ఇతర విద్యలు అభ్యసించేవారు.

3) వైశ్యులు : నిజ జీవితంలో అందరికి ఉపయోగపడే ఆర్ధిక, దైనందిన అవసరాల గురించి వినియోగం పంపిణీ తదనుగుణంగా ఉత్పత్తి, వాటికి ఆర్థిక విలువ ఆపాదన, వాణిజ్యం (commerce) ఇతర వృత్తివిద్యలు అభ్యసించేవారు.

4) శూద్రులు : బలహీనత, సోమరితనం, అజ్ఞానం, సకాలంలో స్పందనలేనివారు సమాజంలోని అందరి అవసరాలు తీర్చే సేవకులుగా మారారు. వీరు ప్రధాన విద్యలకు దూరంగా కేవలం సామాన్య పరిజ్ఞానం మాత్రమే 'విద్య'లో పొందేవారు.

  • ఆనాటి విద్యాకేంద్రాలు ఎక్కువగా జనసమర్ధం, నగరజీవనం గడిపే ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయబడినాయి. 
  • విద్యార్థులు, శిక్షణార్థులు, ఉపాధ్యాయుడు (గురువు/ఒజ్జ) అదుపాజ్ఞలలో ఉండి గురు ఆశ్రమాలలో విద్యను అభ్యసించేవారు. ముఖ్యంగా ఈ విద్యయే మధ్యయుగం నుంచి గుప్తయుగకాలం వరకు కొనసాగింది. 
  • గుప్తుల కాలంలో వారణాసి, నలందా ప్రధాన విద్యాకేంద్రాలుగా వర్ధిల్లాయి. 
  • నలందా విశ్వవిద్యాలయాలలో 2000 మంది శిష్యులు, 2000 మంది గురువులుండేవారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఇందులో బౌద్ధమత వ్యాప్తి, అహింస, ధర్మసూత్రాలు బోధించబడేవని తెలుస్తుంది.
భారతదేశంలో సాంప్రదాయ విద్య ప్రధానంగా వారి వారి మతాలకు అనుబంధంగా కొనసాగేది. ముఖ్యంగా నలంద, తక్షశిల మొదలైన ప్రాచీన నగరాలలో జైన, బౌద్ధ ఆశ్రమాలు ఏర్పడి, అక్కడ వ్యాకరణం, వైద్యవిద్య, తర్కశాస్త్రం, భౌతికవాదం, కళలు, చేతివృత్తులు మొదలైనవి నేర్పబడేవి. తదనంతర కాలంలో బౌద్ధమత వ్యాప్తికి బోధనాన్వేషణ, విదేశీయానం ద్వారా అనుభవం పొందడం మొదలైన లక్ష్యాలతో విశ్వవ్యాప్తంగా బౌద్ధమత ప్రబోధనలు, విద్యావ్యాప్తికి నాంది పలికింది. చైనా, మధ్య ఆసియా ఖండం నుంచి విద్యార్థులు వీటిలో ప్రవేశం కూడా పొందారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section