19వ శతాబ్దిలో ఎలిమెంటరీ విద్యావ్యవస్థ | Elementary education system in the 19th century
VINAYS INFOMarch 15, 2022
19వ శతాబ్దిలో ఎలిమెంటరీ విద్యావ్యవస్థ | Elementary education system in the 19th century
క్రీ.శ 1813 నుంచి ఈస్టిండియా కంపెనీ విద్యా బాధ్యతను స్వీకరించింది.
19వ శతాబ్ది ఆరంభంలో ఎలిమెంటరీ విద్య ప్రధానంగా రెండు కారణాలవల్ల అంతగా అభివృద్ధి చెందలేదు.
ఒకటి అథోముఖ వడపోత సిద్ధాంతంను (Downward filtration theory) అవలంభించడం. దీనిద్వారా విద్యా సౌకర్యాలను పై తరగతివారికి మాత్రమే అందచేయడం.
రెండవది విద్యకు కేటాయించిన నిధులు పూర్తిగా పరిమితం కావడం.
1854 ఉడ్స్ డిస్పాచ్ తిరిగి సామాన్య ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండేటట్లు అనేక తీర్మానాలను చేసింది.
ఏదిఏమైనా 19వ శతాబ్ది చివరివరకు ప్రాథమిక విద్య ఎలాంటి ప్రగతి సాధించలేదు.
1902లో లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయ కమీషన్ ను నియమించి విద్యావ్యాప్తికి చొరవ చూపారు.
1901లో సిమ్లాలో విద్యాసదస్సును నిర్వహించి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి వరకు ఉన్న విద్యా సమస్యలను చర్చించారు. కాని ఈ కమీషన్ భారతీయులనెవరిని సభ్యులుగా నియమించకుండా భారతీయుల మనోభావాలకు తీవ్ర విఘాతాన్ని కలిగించారు.
1904లో కర్జన్ ఎలిమెంటరీ పాఠశాలల నిర్వహణకోసం ఉపాధ్యాయుల నియామకం, నిధుల విడుదల చేపట్టారు.
1901-21 మధ్య కాలంలో అనేక మంచి పరిణామాలు చోటుచేసుకొని ఎలిమెంటరీ విద్యావ్యాప్తికి దోహదపడ్డాయి.
భారతజాతీయ కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాల మూలంగా ప్రజలు చైతన్యవంతులయ్యారు.
మొదటి ప్రపంచయుద్ధం నూతన సామాజిక, ఆర్థిక అంశాలను ప్రభావితం చేసింది. దాని ఫలితంగా ఆడపిల్లలకు చదువు చెప్పించాలనే ఆకాంక్ష తల్లిదండ్రులలో పెరిగింది.
పాఠశాలల్లో నమోదు పెరిగింది. నిర్భంధ ప్రాథమిక విద్యకు డిమాండు భారతీయులవల్ల ప్రారంభమైంది.
1910లో కేంద్రీయ శాసనసభలో గోఖలే నిర్భంధ ప్రాథమిక విద్యను కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
1911లో దీనికి సంబంధించిన బిల్లు సభలో వీగిపోయినప్పటికీ, ప్రజల దృష్టిని ప్రాథమిక విద్య అమలుపై మళ్లించగలిగింది. ఫలితంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం దీనికి నిధులను పెంచింది.