Type Here to Get Search Results !

Vinays Info

పురాణం - Puranam in Telugu

పురాణం - Puranam in Telugu

భారతాత్మకు తలస్పర్శియని 'మిత్ర సమ్మితమని' ప్రసిద్ధి పొందిన పురాణం వేదార్థాన్ని మిత్రునివలే తెలియజేస్తుంది. చతుర్దశ విద్యలలో ఒకటిగా పురాణ విద్య ప్రాచీన కాలంలో ప్రసిద్ధి పొందింది.

పురాపినవంభవతీతి పురాణమ్, పురానీయతే ఇతిపురాణమ్, పురాభవం ఇతి పురాణమ్, మొ॥ నిర్వచనాలున్న పురాణ శబ్దానికి ప్రాచీనమైనదని అర్థం. ప్రాచీన గాథలను తెలిపే పురాణాలు 'సర్గశ్చ, ప్రతి సర్దశ్చ వంశో, మన్వంతరాణిచ వంశాను చరితం చేతి పురాణం పంచలక్షణమ్' అను 5 లక్షణాల్ని కలిగి ఉంటాయి.

సర్గమనగా సృష్టి, ప్రతిసర్గమనగా ప్రళయం, వంశమనగా సూర్యచంద్ర వంశ రాజుల చరిత్రలు, మన్వంతరమనగా మహాయుగాలు, యుగాలు, కల్పాలు, మన్వంతరాలు మొ॥ కాలాలు, 14 మనువుల చరిత్రలు, వంశాను చరితమనగా ఇతర వంశకర్తల చరిత్రలు తెలియజేసేవే పురాణాలు.

భాగవతాది పురాణాల్లో పురాణానికి 10 లక్షణాలను ప్రతిపాదించారు. అవన్నీ పంచలక్షణాలతోనే గతార్థమవుతున్నాయి. పురాణాలు, ఉపపురాణాలు, ఔపపురాణాలు అని పురాణాల్లో అనేక రకాలున్నాయి. పురాణ లక్షణాలు పూర్తిగా కలిగినవిగా 18 ) పురాణాలు ప్రసిద్ధమైనవి.

మద్వయం భద్వయంచైవ బ్రత్రయం వచతుష్టయమ్ । అనాపలింగకూస్కాని పురాణాని ప్రచక్షతే॥ 

  • మద్వయం - మత్స్య, మార్కండేయ పురాణాలు
  • భద్వయం - భాగవత, భవిష్య పురాణాలు
  • బ్రత్రయం - బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త పురాణాలు
  •  వచతుష్టయం - వరాహ, వామన, విష్ణు, వాయు (శివ) పురాణాలు,

అ - అగ్నిపురాణం, నా - నారదీయ పురాణం, ప - పద్మ పురాణం, కూ- కూర్మ పురాణం, స్కా- స్కాంద పురాణం అనునవి అష్టాదశ పురాణాలు.

పూర్వం పురాణాలన్నీ ఒక సంహితగా ఉండేవని నాలుగు లక్షల శ్లోకాల సంహితను వ్యాసుడు రచించాడని, వేదాల వలెనే ఈ సంహితను కూడా 18 భాగాలుగా విభజించాడని అంటారు.

పురాణాల్లోని కథలు, ఉపాఖ్యానాలు, చరిత్రలు, స్తోత్రాలు ఆస్తికతత్వాన్ని పోషించడానికన్నట్లు ఉంటాయి. పాశ్చాత్యులు మైథాలజీగా పురాణ వాజ్మయాన్ని పేర్కొంటారు.

సంప్రదాయానికి వ్యతిరేకమైన బౌద్ధ, జైనమతాలు కూడా తమ దర్శన వ్యాప్తికి అవతార కథలను ప్రచారం చేసాయి. జాతక కథలు బౌద్ధంలో పురాణాల వంటివి. జైన తీర్థంకరుల చరిత్రలను తెలియజేయు జైన పురాణాలు ప్రచారంలో కొచ్చాయి. జైనపురాణాలు సంస్కృత ప్రాకృత భాషల్లోనే గాక దేశీ భాషలలో కూడా రచింపబడ్డాయి.

తెలుగు సాహిత్యంలో పాల్కురికి సోమన వ్రాసిన బసవపురాణం మొట్టమొదటిది. దేశిపురాణమైన బసవపురాణంపై కన్నడ వీరశైవగీతాలు, జైనపురాణాలు ప్రభావం చూపాయని అంటారు. ఇది ద్విపద ఛందస్సులో వ్రాయబడినది. తిక్కన శిష్యుడైన మారన వ్రాసిన మార్కండేయ పురాణాన్ని సంస్కృతం నుండి అనువాదమైన తొలి మహాపురాణంగా పేర్కొంటారు.

దీనిని ప్రతాపరుద్రుని సేనాని అయిన గన్నసేనానికి అంకితమిచ్చాడు.

ఎఱ్ఱన నృసింహ పురాణాన్ని అనువదించాడు. ఇందులో ప్రబంధ కవితారీతులను ప్రయోగించాడు. పోతన భాగవతాన్ని రసరమ్యంగా, పండితపామర హృదయానందకరంగా ఆంధ్రీకరించాడు.

నంది మల్లయ్య, ఘంట సింగన్న అను జంటకవులు వరాహ పురాణాన్ని రచించారు. దీనినే కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితుడు వచనంలో వ్రాసాడు.

తుపాకుల అనంత భూపతి విష్ణుపురాణాన్ని వచనంగా వ్రాసాడు.

పిల్లలమఱి పినవీర భద్రుడు నారదీయ పురాణాన్ని వ్రాసాడందురు. ప్రస్తుతం అది అలభ్యం. పింగళి సూరన గరుడ పురాణాన్ని అనువదించాడని ప్రసిద్ధి గలదు. కానీ లభించుటలేదు. లింగమగుంట రామకవి మత్స్యపురాణాన్ని, ఎలకూచి బాలసరస్వతి వామన పురాణాన్ని అనువదించారు. |జనమంచి శేషాద్రి శర్మ బ్రహ్మాండ పురాణాన్ని వ్రాసాడు. శ్రీనాథుడు స్కాందపురాణాంతర్గతభాగాలైన భీమఖండ కాశీఖండములను కావ్యాలుగా వ్రాసాడు.

అధునాపంతుల సత్యనారాయణ ఆంధ్ర పురాణం మొదలైనవి ఆధునిక కాలంలో మడికి సింగన 11 ఆశ్వాసాల పద్మపురాణాన్ని వ్రాసాడు. ఇందు రామావతార కృష్ణావతార కథలున్నాయి. ములుగు పాపయారాధ్యుడు, దాసు శ్రీరామకవి గౌడపురాణం వంటివి ప్రచారంలో ఉన్నాయి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section