గల్పిక - Galpika

VINAYS INFO
VINAYS INFO

గల్పిక - Galpika

  • తెలుగులో గల్పిక ప్రక్రియకు ఆద్యుడు - కొడవటిగంటి కుటుంబరావు
  • కొడవటిగంటి కుటుంబరావు రాసిన గల్పికలను ప్రచురించిన పత్రిక - 'యువ పత్రిక'.
  • గల్పిక రచనలు చేసిన భావకవి - అడవి బాపిరాజు.
  • 1940 ప్రాంతంలో తెలుగులో వచ్చిన విశిష్ట సాహిత్య ప్రక్రియ - గల్పిక

గల్పిక లక్షణాలు 

1. గల్పికలో విమర్శ ప్రధానం.

2. పరిణామంలో కథానిక కంటే చిన్నది.

3. సంఘటనకు ప్రాధాన్యం అధికం.

4. వస్తువులో ఏకాంశవ్యగ్రత.

5. అనుభూతి చిత్రణకంటే అనుభవ ప్రకటనకు భావదృష్టికి ప్రాధాన్యం.

6. వ్యక్తిని గానీ, వ్యవస్థను గానీ విమర్శించడం గల్పికలో సర్వసాధారణం.

నిర్వచనాలు

  • మానవ జీవితంలోని ఒడిదుడుకుల్ని చిత్రించేది కథానిక అయితే ఒక వ్యక్తిని గానీ, ఒక వ్యవస్థను గానీ అవహేళన చేసేది గల్పిక.
  • ఒక వ్యక్తి అనుభవంలోని ఒక దశకానీ, ఒక సంస్థ పరిణామక్రమంలోని ఒక విశేషము కానీ గల్పికలో ప్రధాన వస్తువు.

You may like these posts

Post a Comment