Type Here to Get Search Results !

Vinays Info

తత్వశాస్త్రం - ఉపాధ్యాయుడు (Philosophy Teacher)

 తత్వశాస్త్రం - ఉపాధ్యాయుడు (Philosophy Teacher)

ఉపాధ్యాయులందరు తత్త్వవేత్తలు కానవసరంలేదు. కాని ప్రతి ఉపాధ్యాయునకు విద్యాతత్వం తెలిసి ఉండాలి. విద్యా ప్రక్రియలు అమలు చేయడానికి విద్యాతత్వ అవగాహన ఎంతైనా అవసరం. దేశ సంస్కృతి, మతాలు, సంప్రదాయాలు, అలవాట్లు, నమ్మకాలు విద్యపై ప్రభావం చూపుతాయి. విద్యావిలువలు వీటిపై ఆధారపడి ఉంటాయి. ఉపాధ్యాయుడు కూడా సంఘంలో ఒక వ్యక్తియే. కాబట్టి వీటి ప్రభావానికి అతడు లోనుగాక తప్పదు. గతంలో ఉపాధ్యాయుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో సమానుడు కాని ఈనాడు ఉపాధ్యాయుడు . విద్యార్థికి మార్గదర్శి, స్నేహితుడు, తత్త్వవేత్త, కాలానుగుణంగా అతని స్థానంలో మార్పులు వచ్చాయి. 

ఈనాడు ఉపాధ్యాయుడు భావిపౌరులను తీర్చిదిద్దుతున్నాడు. ఆదర్శాలను, విలువలను నేర్పుతున్నాడు. తాత్విక భావంగల ఉపాధ్యాయుడు తీర్చలేని సమస్యలుండవు అంటారు. 

తాత్విక జ్ఞానం ఉపాధ్యాయునికి చేసే సహకారం :

1. ఉపాధ్యాయునికి ఒక జీవిత విధానం నివ్వడం.  

2. నిర్మాణాత్మకంగా, శాస్త్రీయంగా ఆలోచించగల శక్తినిస్తుంది..

3. ఉపాధ్యాయునికి ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. .

4.క్రమశిక్షణ, సమస్యలు తీర్చి సహాయపడుతుంది.

5. విద్యా సమస్యలపై అవగాహన కలిగిస్తుంది.

6.విద్యలో ప్రయోగాలు చేయడానికి మార్గదర్శకత్వం వహిస్తుంది.

 తత్వశాస్త్రం పాఠశాల పరిపాలనా విధానం (Philosophy- School Administration)

విద్యావిధానం దేశ పరిపాలన ఏ రాజకీయ విధానంతో ముడిపడియున్నదో దాన్నిబట్టియే రూపొందుతుంది. ప్రజాస్వామ్యంలో, భావప్రకటన స్వేచ్ఛకు ఎంతైనా ప్రాముఖ్యత ఉంటుంది. నియంతలు పాలించే దేశంలో స్వేచ్ఛకు తావుండదు. ఏకైక వ్యక్తి యిష్టాయిష్టాలననుసరించి విద్యావిధానం రూపొందుతుంది. ఆధునిక సమాజంలో రాజకీయాలదే పెద్దపీట. కాబట్టి అన్ని పరిపాలనా విధానాలు దానికనుగుణంగా రూపొందుతాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section