Type Here to Get Search Results !

Vinays Info

పోషక పదార్థాలు - NUTRIENTS

పోషక పదార్థాలు - NUTRIENTS

  • శరీరానికి కావాల్సిన శక్తినివ్వడంలో, పెరుగుదల అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించే పదార్థాలను “పోషక పదార్థాలు” అంటాం.
  • వీటి అధ్యయనం : ట్రోపాలజి (or) Dietetics 
  • ఇవి ముఖ్యంగా Carbohydrates, Proteins, Fats,Minerals (ఖనిజ మూలకాలు), Vitamins. 
  • పై పోషకాలను జీవరసాయనాలు (Biochemicals) అంటారు.
  • పై అన్నిరకాల పదార్థాలు కలిగిన ఆహారాన్ని సంపూర్ణ ఆహారం (Complete Diet) అంటారు. ఉదా॥ పాలు

  • అన్ని పోషక పదార్థాలు సమానపాళ్లలో ఉండే ఆహారాన్ని "సంతులిత ఆహారం" (Balanced Diet) అంటారు.
  • పోషక నిపుణుల సలహా ప్రకారం ఒక రోజుకు తీసుకునే ఆహారంలో CPF నిష్పత్తి 60 : 15 : 25 ఉండాలి. 
  • Carbohydrates, Proteins, Fats అధిక మొత్తములో ఆహారంగా అవసరం కావున వాటిని "స్థూలపోషకాలు” అంటారు.
  • Vitamins, Minerals తక్కువ మొత్తంలో అవసరం కావున,, వాటిని "సూక్ష్మపోషకాలు” అంటారు.


పాలు (MILK)

  • ఇది చిక్కగా ద్రవరూపంలో ఉండి క్రొవ్వులు తేలియాడు. తున్నట్లుగా ఉండును. కావున దీనిని Emulsion అంటారు.
  • దీనిలోని Carbohydrates / చక్కెర: లాక్టోజ్ (7-8%) 
  • పాల తెలుపుకు కారణం. Protein :- కెసిన్ P
  • క్రొవ్వు :- లాక్టిక్ ఆమ్లం (పులుపు రుచి)
  • Minerals : - Ca, Fe (కావున పెరిగే పిల్లలకు [14 సం॥ లోపు పిల్లలకు ఇది అతిముఖ్య ఆహారం) Vitamins:- 'C' విటమిన్ తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి.
  • Enzyme :- Lactase
  • Bacteria:- Lactobacillus
  • (ఈ బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చును అనగా కెసిన్ పారాకెసిన్గా మారును).
  • పాల యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం లాక్టోమీటర్,

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section