Type Here to Get Search Results !

Vinays Info

పరపోషణ (Heterotrophic Nutrition)

పరపోషణ (Heterotrophic Nutrition)

మనుషులు, జంతువులు మొక్కలు తయారు చేసిన ఆహారం మీద ఆధారపడినట్లే, కొన్ని మొక్కలు ఇతర మొక్కల మీద ఆధారపడతాయి. ఈ విధమైన పోషణను 'పరపోషణ' అంటారు.

ఉదా: పరాన్న జీవ మొక్కలు - కస్క్యుట (సంపూర్ణ కాండ పరాన్న జీవి) - డాడర్ (లేదా) బంగారు తీగ.

పరపోషణ (Heterotrophic Nutrition) - Vinays Info

A) పరాన్న జీవులు (Parasites):

  • పోషకాలను ఇతర జీవుల నుంచి గ్రహించు జంతువులు లేదా మొక్కలను 'పరాన్నజీవులు' అంటారు.
  • పరాన్న జీవులు 'ఆహారం, ఆశ్రయం' కొరకు 'అతిధేయిపై' ఆధారపడతాయి.
  • ఇవి పరిమాణంలో 'చిన్నవిగా ఉంటాయి
  • పరాన్న జీవులు అతిధేయి నుండి పోషకాలు పొంది అతిధేయికి హాని కల్గిస్తాయి.
  • పరాన్న జీవులకు ఉదా: 
  • 1) మొక్కలు : రఫ్లేషియా, ఓరబాంకి,స్ట్రెయిగా, బెలనోఫొరా, కస్యూట, విస్కమ్, లొరాంథస్. 
  • 2) జంతువులు : పాస్మోడియం, ఉచరేరియా మొ||నవి.

B) అతిధేయి (Host)

  • పరాన్నజీవికి 'ఆహారం, ఆశ్రయం' అందించునది అతిథేయి.
  • అతిథేయి నుండి 'జీర్ణమైన ఆహారాన్ని' పరాన్నజీవి పొందుతుంది. 
  • అతిథేయి పరిమాణంలో 'పెద్దదిగా' ఉంటుంది.
  • ఉదా: మానవుడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section