Type Here to Get Search Results !

Vinays Info

క్రొమటోగ్రఫీ(Chromatography) | TS TET

  • రంగు ఆధారంగా వర్ణకాలను వేరుచేసే పద్ధతిని ‘క్రొమటోగ్రఫీ(Chromatography)’ అంటారు. ఇది ఒక ప్రయోగశాల ప్రక్రియ.
  • సిరాలోని అనుఘటకాలు వేరుచేయడానికి మొక్కలు, పుష్పాల్లోని రంగు వర్ణకాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.
  • ఒక ద్రవం మరొక ద్రవంలో పూర్తిగా కలిసిపోతే వాటిని ‘మిశ్రమ ద్రవాలు’ అంటారు.
  • ఉదాహరణ: నీరు+ఆల్కహాల్‌ నీరు+ ఎసిటిన్‌
  • మిశ్రణీయ ద్రవాలను వేరుచేయడానికి స్వేదనం, అంశిక స్వేదనం అనే పద్ధతులు ఉపయోగిస్తారు.
  • రెండు ద్రవాల మరిగే స్థానాల మధ్య వ్యత్యాసం 25oC కంటే ఎక్కువగా ఉంటే ‘స్వేదన ప్రక్రియను’ 25oC కంటే తక్కువగా ఉంటే ‘అంశిక స్వేదనం’ ప్రక్రియను ఉపయోగిస్తారు.
  • నీరు (B.P 100oC) + ఇథైల్‌ ఆల్కహాల్‌- వేరుచేయడం అంశిక స్వేదనం (B.P 78oC)
  • నీరు (B.P 100oC) +ఎసిటోన్‌ – వేరుచేయడం స్వేదనం (B.P 56oC)
  • ఒక ద్రవం మరొక ద్రవంలో కరగకుండా ఉంటే వాటిని ‘అమిశ్రణీయ ద్రవాలు’ అంటారు.
  • ఉదాహరణ: నూనె+ నీరు డీజిల్‌+నీరు
  • అమిశ్రణీయ ద్రవాలను వేరుచేయడం కోసం ‘వేర్పాటు గరాటు’ ఉపయోగిస్తారు.
  • ఒక ద్రావణంలో పూర్తిగా కరిగిపోయిన ద్రావితం ఘన పదార్థం అయితే ద్రావితం, ద్రావణిలను వేరుచేయడానికి ‘బాష్పీభవనం’ స్ఫటికీకరణం అనే ప్రక్రియను ఉపయోగిస్తారు.
  • ఉదాహరణ: చక్కెర ద్రావణం నుంచి చక్కెర ఉప్పు ద్రావణం నుంచి ఉప్పును వేరుచేయడం.


గాలిలోని అనుఘటకాలు

  • N2- 78% (B.M.P 196oC)
  • Q2-20.9% (B.M.P -183oC)
  • Ar- 0.9% ఉంటాయి

(M.P – 186oC)

  • గాలిలోని అనుఘటకాలను వేరుచేయడానికి గాలిని ద్రవీకరించి వాటిని‘అంశికస్వేదన ప్రక్రియ’కు గురిచేస్తారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section