ప్రపంచ మట్టి (లేదా) నేల దినోత్సవం చరిత్ర మరియు దాని విశిష్టత, ప్రాముఖ్యత (History and Significance of World Soil Day)
ఉద్దేశ్యం:
- ఆహారభద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు మరియు మానవ శ్రేయస్సు కోసం నేల నాణ్యత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ప్రపంచ నేల/మట్టి దినోత్సవం (World Soil Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
చరిత్ర:
- 2002లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ (IUSS-International Union of Soil Sciences) ప్రపంచ మట్టి (లేదా) నేల దినోత్సవాన్ని (World Soil Day) ప్రతి సంవత్సరం డిసెంబర్ 5 న జరుపుకోవాలని సిఫారసు చేసింది.
- 2012లో థాయిలాండ్ దేశం నాయకత్వంలో మరియు Global Soil Partnership యొక్క చట్రంలో, ప్రపంచ అవగాహన పెంచే వేదికగా అధికారికంగా మట్టి (లేదా) నేల దినోత్సవాన్ని ఏర్పాటుచేయడానికి FAO మద్దతు ఇచ్చింది.
- FAO యొక్క సమావేశం 2013 జూన్ లో ప్రపంచ నేల దినోత్సవాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మరియు 68 వ UN సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించాలని అభ్యర్థించింది.
- 2013 డిసెంబర్‌లో 68వ సర్వసభ్య సమావేశంలో UN జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 5 ను ప్రపంచ నేల దినంగా ప్రకటించింది.
- మొదటి ప్రపంచ నేల దినోత్సవాన్ని 2014 డిసెంబర్ 5 న జరుపుకున్నారు.
Also Read: జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం | National Pollution Control Day
డిసెంబర్ 5 నే ఎందుకు?
- ఈ దినోత్సవం ఏర్పాటుకు ప్రధాన ప్రతిపాదకులలో ఒకరైన థాయిలాండ్ 09వ రాజు King Bhumibol Adulyadej (జ:5 December 1927 - మ:13 October 2016) జన్మ దినం సంధర్భంగా ఆయనకు గుర్తుగా డిసెంబర్ 5ను ప్రపంచ మట్టి (లేదా) నేల దినోత్సవంగా జరుపుకుంటారు.
థీమ్ (Themes of World Soil Day)
- 2021: Halt soil salinization, boost soil productivity(మట్టి లవణీకరణను ఆపండి, నేల ఉత్పాదకతను పెంచండి)
- 2020: నేలని సజీవంగా ఉంచండి, నేల జీవవైవిధ్యాన్ని రక్షించండి (Keep soil alive, Protect soil biodiversity)
- 2019: నేల కోతను ఆపండి, మన భవిష్యత్తును కాపాడండి (Stop Soil Erosion, Save our Future)
- 2018: నేల కాలుష్యానికి పరిష్కారం! (Be the Solution to Soil Pollution)
- 2017: గ్రహం యొక్క సంరక్షణ గ్రౌండ్ నుండి మొదలవుతుంది (Caring for the Planet starts from the Ground)
- 2016: నేలలు మరియు పప్పుధాన్యాలు జీవితానికి సహజీవనం (Soils and pulses, a symbiosis for life)
- 2015: ఆరోగ్యకరమైన జీవితానికి ఆరోగ్యకరమైన నేలలు (Healthy soils for a healthy life)
నేల కాలుష్యం(Soil Pollution):
- భూమి ఉపరితలాన్ని 71% సముద్రపు నీరు ఆవరించి ఉంది. కేవలం 29% మాత్రమే నేల ఆవరించి ఉంది.
- నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాలలో నేల కాలుష్యం కూడా ముఖ్యమైనది.
- పరిశ్రమలు రసాయన వ్యర్థాలను నేలపై విచక్షణ రహితంగా పారబోయడంవల్ల, వ్యవసాయ రంగంలో పురుగుమందులను ఎక్కువగా ఉపయోగించడంవల్ల, నేల విషతుల్యమౌతుంది. దీనివల్ల నేల సారం దెబ్బతింటుంది.
- అలాగే నీరు ఎక్కువ కాలంపాటు ఒకేచోట నిల్వ ఉండటం వల్ల నేల ఉప్పురికి సారాన్ని పోగొట్టుకుంది.
- వరదలు, భారీ వర్షాలు నేల కోతకు కారణం అవుతున్నాయి. సారవంతమైన నేల పైపొర కొట్టుకు పోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు.
- #WorldSoilDay2021