అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం | International Volunteer Day in Telugu
VINAYS INFO
అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం ఉద్దేశ్యం మరియు దాని ప్రాముఖ్యత, విశిష్టత (History of International Volunteer Day)
ఉద్దేశ్యం:
ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధిలకు మద్దతుగా వాలంటీరిజాన్ని మెరుగుపరచడంతోపాటు... కష్టాల్లో ఉన్నవారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారందరి సేవను గుర్తించడం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం (International Volunteer Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
అభివృద్ధి లక్ష్యాల్ని అందుకోవడానికి అనేక దేశాలు స్వచ్చంద కార్యకర్తల సేవలపై దృష్టిని సారించాయి. పేదరికము, ఆకలి, రుగ్మతలు, నిరక్షరాస్యత, వాతావరణ లోపాలు, మహిళలపట్ల వివక్ష వంటి సమస్యల్ని ఎదుర్కోవడంలో లక్ష్యాలు నిర్ణయించి ఆ దిశగా వలంటీర్లను ప్రోస్తహిస్తున్నారు.
స్వచ్చంద కార్యకర్తలు, కమిటీలు, సంస్థలు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కోసం తమ వంతు కృషిని అందిస్తారు. ప్రభుత్వ సంస్థలు, లాభేతర సంస్థలు, కమ్మ్యూనిటీ గ్రూపులు, ఎకడమిక్ ప్రవేట్ రంగంతో కలసి అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి ప్రజలు, స్వచ్చంద కార్యకర్తలకు ఈ రోజు ఒక మహత్తరమైన అవకాశం వంటిది.
యుఎన్ జనరల్ అసెంబ్లీ 2001 నుండి ప్రతీ సంవత్సరం డిసెంబర్ 5 న ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని (International Volunteer Day for Economic and Social Development) జరుపుకోవాలని ప్రకటించింది.
1997 నవంబరు 20వ తేదీన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2001 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వలంటీర్స్ గా ప్రకటించారు.