Type Here to Get Search Results !

Vinays Info

History of International Human Rights Day in Telugu | అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

History of International Human Rights Day in Telugu | అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం.

History of International Human Rights Day in Telugu | అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం


మానవ హక్కులు:

మానవ ప్రగతికి దోహదం చేసే పరిస్థితులే హక్కులు. సమాజ ఆమోదం పొంది, చట్టబద్ధమైనప్పుడే అవి అర్థవంతమవుతాయి. జాతి, మత, కుల, లింగ, ప్రాంతీయ తేడాలతో సంబంధం లేకుండా మానవులందరికీ హక్కులు వర్తిస్తాయి. వ్యక్తి గౌరవాన్ని (ఔన్నత్యాన్ని) పెంపొందించడానికి హక్కులు అవసరం. ఇవి మానవ నాగరికతకు నూతన ప్రమాణాలు.


లక్ష్యం:

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు తమ హక్కులేంటో తెలియజెప్పడం, అవసరమైన సహకారం అందించడం మరియు వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం (International Human Rights Day) యొక్క ముఖ్య లక్ష్యం.


ఎప్పటి నుండి?

1950 డిసెంబర్ 04 న UNO జనరల్ అసెంబ్లీ 317 వ ప్లీనరీ సమావేశంలో 423 (V) తీర్మానాన్ని ఆమోదించిన తరువాత, అన్ని రాష్ట్రాలను మరియు ఆసక్తిగల సంస్థలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 ను మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.


డిసెంబర్ 10నే ఎందుకు?

  • 1948 డిసెంబరు 10న  పారీస్ నగరంలో ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన (Universal Declaration of Human Rights) చేసింది. అందువల్ల డిసెంబర్‌ 10వ తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల  దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. 
  • క్రీ.శ.1215లో ఇంగ్లండ్ రాజు జాన్ విడుదల చేసిన మాగ్నా కార్టా మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన. 


శతాబ్దాల నాటి ఆలోచన:
  • మానవ హక్కుల భావనను కేవలం రెండో ప్రపంచ యుద్ధానంతరం వచ్చిన ఆలోచనగా భావిస్తున్నారు . వాస్తవానికి హక్కుల భావన అమెరికా స్వాతంత్ర్య ప్రకటన (1776) లో ఒక ముఖ్య నినాదం. ఫ్రెంచి విప్లవ ప్రకటన (1789) కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని తెలియజేస్తుంది.
థీమ్ (Theme):

  • 2020: Recover Better - Stand Up for Human Rights
  • 2019: Youth Standing Up for Human Rights
  • 2018: Stand Up For Human Rights
  • 2017: Let’s stand up for equality, justice and human dignity
  • 2016: Stand up for someone’s rights today

మానవ హక్కుల కమిషన్‌లు:
  • మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతోపాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి.

United Nations Commission on Human Rights (UNCHR):

  • UNCHR 1946లో ECOSOC (Economic and Social Council) చేత స్థాపించబడింది.
  • ఇది మొదటిసారి జనవరి 1947 లో సమావేశమై మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన కోసం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది.
  • ఈ కమిటి యొక్క ముసాయిదాను ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్ 10 న స్వీకరించి, విశ్వమానవ హక్కుల ప్రకటన(Universal Declaration of Human Rights) చేసింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section