Type Here to Get Search Results !

Vinays Info

అంతర్జాతీయ పర్వత దినోత్సవం (International Mountain Day)

అంతర్జాతీయ పర్వత దినోత్సవం (History of International Mountain Day - December 11)

ఉద్దేశ్యం:

పర్వత ప్రాంతాలలో ఉన్న వారికి కనీస అవసరాలకు కావలసినవి దొరకడం కష్టంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు వ్యక్తుల ద్వారా పర్వత ప్రాంత అభివృద్ధికి కావలసిన వివిధ కార్యక్రమాలను నిర్వహించడం కోసం (పర్వత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారిని అభివృద్ధి పర్చేందుకు) ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పర్వత దినోత్సవం (International Mountain Day) ను ఏర్పాటు చేసింది.

అంతర్జాతీయ పర్వత దినోత్సవం (International Mountain Day)

Also Read: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం (International Day of Persons with Disabilities)

ఎప్పటి నుంచి?(small-bt)

2002 లో UN జనరల్ అసెంబ్లీ 2002 ను ఇంటర్నేషనల్ పర్వతాల సంవత్సరం (International Year of Mountains) గా ప్రకటించింది మరియు డిసెంబరు 11ను అంతర్జాతీయ పర్వత దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది.

2003 డిసెంబర్ 11 న మొదటిసారి అంతర్జాతీయ పర్వత  దినోత్సవాన్ని జరుపుకున్నారు.

Also Read: International Human Rights Day | అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

థీమ్ (Themes of International Mountain Day)

  • 2021: Sustainable Mountain Tourism
  • 2020: Mountain biodiversity
  • 2019: Mountains Matter for Youth
  • 2018: Mountains Matter
  • 2017: Mountains under Pressure: climate, hunger, migration
  • 2016: Mountain cultures: Celebrating diversity and strengthening identity

పర్వతాల ఆవిర్భావం(Origin of Mountains)
  • అగ్ని పర్వతాల క్రియాశీలత (Volcanic Activism)
  • భేదక క్రమక్షయం (Differential erosion)
  • భూపటల చలనాలు (Movements of the earth' s crust)
  • పై మూడు బలాలు విడివిడిగా లేదా ఏకకాలంలో పనిచేయడం వల్ల సాధారణంగా పర్వతాలు ఏర్పడతాయి.
పర్వతాలు మూడు రకాలు(Three types of Mountains)

(1) విరూపాకారక పర్వతాలు (Deformation mountains):
భూ అంతర్గత బలాల సర్దుబాట్లు, మార్పుల వల్ల ఏర్పడతాయి. భూమిపై ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. వీటిలోని రకాలు: 
(A) ఖండ పర్వతాలు 
(B) ముడుత పర్వతాలు.

(A) ఖండ పర్వతాలు (Block mountains):
  • భూ అంతర్భాగంలోని తన్యత బలాలు లేదా భూకంపాల వల్ల భూమిపై భ్రంశాలు / పగుళ్లు ఏర్పడతాయి. ఈ భ్రంశాలకు రెండు వైపులాగానీ, మధ్యగానీ భూపటలం పైకీ, కిందికి కదులుతూ ఉంటుంది. ఇలాంటి రెండు సమాంతర భ్రంశ తలాల మధ్య భాగం కుంగిపోవడం వల్ల లేదా దానికి ఇరువైపులా ఉన్న భూఖండం పైకి రావడం వల్ల ఎత్తైన ప్రాంతం ఏర్పడుతుంది. ఇలా ఎత్తుగా ఏర్పడిన ప్రాంతాన్నే భ్రంశోళిత శిలా విన్యాసం (Horst) లేదా ఖండ పర్వతం అంటారు. ఖండ పర్వతాలు కఠిన శిలలతో ఉంటాయి. 
  • రెండు ఖండ పర్వతాలకు లేదా ఎత్తైన ప్రాంతాలకు మధ్య ప్రాంతం కిందికి దిగడం వల్ల ఏర్పడిన లోయను పగులు లోయ (Rift valley) అంటారు.
  • ప్రపంచంలో అతి పెద్ద పగులు లోయ - ఆఫ్రికాలో నైలు నది ప్రవహిస్తున్న పగులు లోయ. దీన్ని గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ అంటారు.
(B) ముడుత పర్వతాలు (Fold mountains): 
  • సముద్ర భూ అభినతిలోని రాతి పొరలపై కలిగే పార్శ్వ (Lateral), ఊర్ధ్వ (Vertical) బలాలు, ఖండ పలకల అభిముఖ చలనంవల్ల సముద్ర భూతలం ముడుతలు పడి పైకి నెట్టుకురావడం వల్ల ఏర్పడతాయి. వీటిని పురాతన, నవీన ముడుత పర్వతాలుగా వర్గీకరించవచ్చు.
  • ఆరావళి అపలేచియన్, యూరప్, గ్రేట్ డివైడింగ్ రేంజ్ లను పురాతన ముడుత పర్వతాలుగా, ఉత్తర ఆమెరికాలోని రాఖీ, దక్షిణ అమెరికాలోని ఆండీస్, ఐరోపాలోని ఆల్ఫ్స్, భారత్ లోని హిమాలయాలను నవీన ముడుత పర్వతాలుగా పేర్కొంటారు.
  • ప్రపంచంలో అతి తరుణ లేదా అతి తక్కువ వయసు ఉన్న, ఎత్తైన ముడుత పర్వతాలు హిమాలయాలు.
  • ప్రపంచంలో పొడవైన ముడుత పర్వతాలు - ఆండీస్ పర్వతాలు.

(2) పరిశిష్ట లేదా అవశిష్ట పర్వతాలు (Recidual mountains):
  • ఒకప్పుడు ఎత్తుగా ఉండి గాలి, నీరు, వాతావరణం లాంటి బాహ్య ప్రకృతి కారకాల వల్ల నిర్విరామంగా క్రమక్షయానికి గురై, ఎత్తు తగ్గి ఇంకా నిలిచి ఉన్న పర్వతాలను అవశిష్ట పర్వతాలు అంటారు. ఉదాహరణకు భారతదేశంలోని ఆరావళి పర్వతాలు, రాజ్ మహల్ కొండలు, ఉత్తర అమెరికాలోని అపలేచియన్ పర్వతాలు.
3) సంచిత లేదా అగ్ని పర్వతాలు (Accumulative / Volcanic mountain):
  • భూ అంతర్భాగంలోని శిలాద్రవం (మాగ్మా) భూ ఉపరితలానికి ప్రవహించి (లావా) సంచితంగా లేదా కుప్పగా ఏర్పడుతుంది. ఇలా శంకువు ఆకారంలో ఘనీభవించే లావా పటలాలతో కూడిన ఎత్తైన ప్రాంతాలను అగ్ని పర్వతాలు అంటారు.
  • ఆండీస్ పర్వత శ్రేణుల్లో అనేక అగ్ని పర్వతాలు ఉన్నాయి. చిలీలోని అకాన్ గ్వా , జపాన్ లోని ఫ్యూజియామా, ఇటలీలోని వెసూవియస్ ప్రధానమైన అగ్నిపర్వతాలు.

వివిధ ఖండాల్లోని ఎత్తైన పర్వత శిఖరాలు:
  • ఆసియా - ఎవరెస్ట్ -  8848.86 మీ (దేశం - నేపాల్)
  • ఆఫ్రికా - కిలిమంజారో - 5895 మీ (దేశం - టాంజానియా)
  • ఐరోపా - ఎల్ బ్రస్ - 5642 మీ (దేశం - రష్యా)
  • ఉత్తర అమెరికా - మెకిన్లే - 6194 మీ (దేశం - అలస్కా)
  • దక్షిణ అమెరికా - అకాన్ గ్వా 6962 మీ (దేశం - అర్జెంటీనా)
  • ఆస్ట్రేలియా - కోషియాస్కో - 2228 మీ (న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా)
  • అంటార్కిటికా - విన్సన్ మాసిఫ్ - 4897 మీ 
పర్వతాల గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు:
  • భూమిపై ఎత్తైన పర్వతం - ఎవరెస్ట్. దీని ఎత్తు 8848.86 మీ. (నేపాల్ దేశంలో ఉంది)
  • భూమిపై రెండవ ఎత్తైన పర్వతం - K2. దీని ఎత్తు 8611 మీ.  (చైనా-పాకిస్తాన్ సరిహద్దులో  కారాకోరం శ్రేణిలో ఉంది) దీనిని మౌంట్ గాడ్విన్-ఆస్టెన్ లేదా చోగోరి అని కూడా పిలుస్తారు.
  • భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం మరియు ప్రపంచంలో 3 వ ఎత్తైన శిఖరం - కాంచెనగంగ. దీని ఎత్తు 8586 మీ. (సిక్కిం రాష్ట్రంలో ఉంది)
  • దక్షిణ భారతదేశంలో అతి ఎత్తయిన పర్వత శిఖరం - పశ్చిమ కనుమలలోని అనైముడి (Anamudi) (కేరళ రాష్ట్రంలో ఉంది). దీని ఎత్తు 2695 మీటర్లు.
  • భారతదేశ పరిధిలోని ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతం (Volcano) - బారెన్ (Barren) (అండమాన్ నికోబార్)
  • భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ఉన్న పర్వతశ్రేణి - పాబ్ కాయ్ 
  • హిమాచల్ శ్రేణులలో పొడవైన పర్వతశ్రేణి - పీర్ పంజల్ పర్వతశ్రేణి
  • సియాచిన్ గ్లేసియర్ ఏ పర్వత శ్రేణిలో ఉంది - కారాకోరం శ్రేణి
  • కావేరినది ఏ పర్వత శ్రేణుల్లో ఆవిర్భవించింది - బ్రహ్మగిరి పర్వతాలు
  • సోలంకీలు నిర్మించిన జైన దేవాలయం ఏ పర్వతంపై ఉంది - మౌంట్ అబూ (ఆరావళి పర్వత శ్రేణి)
  • సౌరకుటుంబంలో అతి ఎత్తయిన పర్వత శిఖరం ఒలంపస్ మోన్స్ (Olympus Mons) ఏ గ్రహంపై ఉంది - అంగారకుడు (Mars). దీని ఎత్తు 22 కిలోమీటర్ల (13.6 మైళ్లు)
  • ప్రపంచంలోని పొడవైన పర్వత శ్రేణులు - ఆండీస్ (Andes) పర్వతాలు (దక్షిణ అమెరికా)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section