కాప్–26 సదస్సులో ప్రసగించిన భారతీయ బాలిక ఎవరు?
వాతావరణ మార్పులపై గ్లాస్గోలోని కాప్–26 సదస్సులో భారత్‌కు చెందిన 14 ఏళ్ల వయసున్న టీనేజ్ బాలిక వినీశా ఉమాశంకర్ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాధినేతల్ని ఫిదా చేసింది. ఎకో ఆస్కార్ అవార్డులుగా భావించే ఎర్త్ షాట్ ప్రైజ్ ఫైనలిస్ట్ అయిన వినీశ కాప్ ఇతర పర్యావరణ పరిరక్షకులతో కలిసి ప్రిన్స్ విలియమ్ విజ్ఞప్తి మేరకు నవంబర్ 3న సదస్సులో మాట్లాడింది. ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని జాన్సన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ల సమక్షంలో తమిళనాడుకి చెందిన వినీశ ధైర్యంగా మాట్లాడింది. ‘‘భూమి ఉష్ణోగ్రతలు తగ్గించే అంశంపై ఇక మీరు మాటలు ఆపాలి. చేతలు మొదలు పెట్టాలి’’ తన ప్రసగంలో పేర్కొంది.