Type Here to Get Search Results !

Vinays Info

గణితశాస్త్ర విద్యాప్రణాళిక - గణిత పాఠ్యపుస్తకాలు

 గణితశాస్త్ర విద్యాప్రణాళిక - గణిత పాఠ్యపుస్తకాలు | Mathematics Curriculum - Mathematics Textbooks

'' ఏకైక ప్రపంచ భాష గణితమే" - నాథానియల్ వెస్ట్.

విద్యా ప్రణాళిక
  • విద్యాప్రణాళికను ఆంగ్లంలో కరికులమ్ (Curriculam) అంటారు.
  • 'కరికులం' అనే పదం 'కరిరే' (Currere) అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. కరిరే అంటే "course to run" అని అర్థం.
  • విద్యా లక్ష్యాలను సాధించడానికి పాఠశాల, ఉపాధ్యాయుడు నిర్వహించే అన్ని వ్యాసక్తులను కలిపి 'విద్యాప్రణాళిక' అంటారు.
  • ''బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాల సముదాయమే విద్యాప్రణాళిక    - 10 సంవత్సరాల పాఠశాల విద్యాప్రణాళిక నిర్దేశాకృతి.
  • ''ఒక పాఠశాల విద్యాప్రణాళిక రాజ్యాంగ చట్టంలా ఆ దేశ ప్రధాన సమస్యలను, ఆలోచనలను ప్రతిబింబిస్తుంది" - 10 సంవత్సరాల పాఠశాల విద్యాప్రణాళిక నిర్దేశాకృతి.
  • ''పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్నీ కలిసి విద్యాప్రణాళిక అవుతుంది" - ఆల్‌బర్టీ.
  • ''విద్యాప్రణాళిక కళాకారుడి (ఉపాధ్యాయుడి) చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో (పాఠశాలలో), తన సామగ్రిని (విద్యార్థిని) తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం" - కన్నింగ్‌హామ్.
  • పాఠశాల ఆవరణలోని తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆటస్థలంలో, ఉపాధ్యాయులతో, ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాలు, అనుభవాల మొత్తం విద్యాప్రణాళిక అవుతుంది - పి.శామ్యూల్.
  • పాఠ్య, సహపాఠ్య కార్యక్రమాలన్నింటినీ కలిపి 'విద్యా ప్రణాళిక' అంటారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section