Type Here to Get Search Results !

Vinays Info

పౌష్టికాహారం - Nutrition(5th Class EVS)

  • ప్రతిరోజు మనం తినే ఆహార పదార్థాలు మనకు శక్తిని ఇస్తాయి.శరీర పెరుగుదలకు మరియు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
  • నావిద్ - ప్రతిరోజు అన్నంలో - పచ్చడి, కారంపొడి, నూనె కలుపుకొని తింటాడు.
  • అరుణ్ - అన్నంలో చిప్స్, మిక్చర్, బిస్కెట్లు, ఐస్క్రీమ్, బ్రేడ్ జామ్, నూడుల్స్ తింటాడు.
  • శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు - 08. వీటినే చిరుధాన్యాలు అని అంటారు.
  • వీటిలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి.

  1. వరి
  2. గోధుమ
  3. జొన్నలు
  4. మొక్కజొన్నలు
  5. తైదలు(రాగులు)
  6. సజ్జలు
  7. సామలు
  8. కొర్రలు
Nutrition - పౌష్టికాహారం
Nurtition-పౌష్టికాహారం

  • వీటిని తినడం ద్వారా మన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.
  • శక్తిని ఇచ్చే పదార్థాలను - పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు అని అంటారు.
    • వీటిలో అధిక పరిమాణంలో - పిండి పదార్థాలు
    • తక్కువ పరిమాణంలో - ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
  • అలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకడ దుంప వంటి రకరకాల పండ్లు, కూరగాయలలో శక్తిని ఇచ్చే పోషక పదార్థాలు ఉంటాయి.
  • వెన్న, నెయ్యి, నూనె మొదలగు వాటిలో - ఎక్కువగా కొవ్వులు ఉంటాయి.
  • కొవ్వు పదార్థాలు మన శరీరానికి శక్తిని అందిస్తాయి.
  • కొవ్వులు మన శరీరంలో ఆడిపోజ్ కణజాలంలో నిల్వ ఉంటాయి.
  • పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు - పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు.
    1. శనగలు
    2. పెసర్లు
    3. కందులు
    4. బఠాణీలు
    5. చిక్కుడు
    6. గుడ్లు
    7. మాంసం
  • వీటిని తినడం ద్వారా - శారీరక పెరుగుదల జరుగుతుంది.
  • మన శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కణాలు చనిపోతూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్తవి పుడుతుంటాయి.
  • కొత్త కణాలు పుట్టడంలో, గాయాలను మాన్పడంలో మాంసకృత్తులు(ప్రోటీన్స్) అనే పోషకాలు అవసరమవుతాయి.
  • ఈ ప్రోటీన్లు - పప్పుధాన్యలో ఉంటాయి. తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి.
  • చేపలు, గుడ్లు, మాంసం, పాలల్లో - ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.
  • పాలల్లో ఉండే - కాల్షియం ఎముకల పెరుగుదలకు, అవి పటిష్టంగా ఉండేందుకు సహాయపడుతాయి.
  • ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు - పండ్లు, కూరగాయలు.
  • మనం తిన్న పిండి పదార్థాలు, మాంసకృత్తులను మన శరీరం వియోగించుకోవడంలో విటమిన్లు ఉపయోగపడతాయి.
  • అయోడిన్, పాస్పరస్, కాల్షియం, ఇనుము - ఖనిజ లవణాలు, ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి.
  • రక్తంలో - ఇనుము, ఎముకలు, దంతాలలో - కాల్షియం, పాస్పరస్ ఉంటాయి.
  • మొలకెత్తిన, ధాన్యాలు, గింజలు, పులియబెట్టిన ఆహార పదార్థాలలో - విటమిన్ లు ఉంటాయి.
  • పండ్లు, కూరగాయలలో - విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి.
  • మన శరీరానికి - కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు - అధికంగా అవసరం.
  • విటమిన్లు, ఖనిజ లవణాలు - తక్కువ పరిమాణంలో అవసరం.
    • ఇవి వ్యాధులను ఎదురుకొంటాయి.
    • రోగాలను తట్టుకునే - శక్తిని ఇస్తాయి 
    • ఇవి ఆరోగ్య సంరక్షకాలు - విటమిన్లు, ఖనిజ లవణాలు
  • Mid Day Meals Programme(MDM) - 
  • మన శరీరానికి - పిండి పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటివి అవసరం.
  • రకరకాల పోషకాలున్న ఆహార పదార్థాలు మనకు అవసరం అవుతాయి. దీనినే సమతుల ఆహారం(Balanced Diet) అని అంటారు.
  • మనం తిన్న ఆహారం జీర్ణమయ్యాక అవసరమైనవి - రక్తంలోకి చేరుతాయి.జీర్ణమైన ఆహారం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది.
  • ఆహారంలో శరీర పెరుగుదలకు ఉపకరించే పదార్థాలను తీసుకోకపోవడం వల్ల మన శరీర భాగాలు ఉబ్బుతాయి.
  • ఒక మధ్యరకం సైజులో ఉండే టమాటలో 
    • 1.08 గ్రా - ప్రోటీన్లు
    • 1.5 గ్రా - ఫైబర్(పీచుపదార్థాలు)
    • అంతేగాక పొటాషియం, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
    • వీటితో పాటు - విటమిన్ A, B2, B6, E, K ఉంటాయి.
    • దీని నుండి 22 కెలోరీలు శక్తి లభిస్తుంది.
  • శక్తినిచ్చే పదార్థాలు - కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు( CFO)
  • పెరుగుదలకు ఉపకరించేవి - ప్రోటీన్స్(మాంసకృత్తులు)
  • ఆరోగ్య పరిరక్షణ, వ్యాధినిరోధక శక్తిని ఇచ్చేవి - విటమిన్లు, ఖనిజ లవణాలు
  • జొన్నపేలాలు, వేయించిన లేదా ఉడికించిన ఉలవలు, శనగలు, కందులు, అలసందలు(బెబ్బర్లు), కాల్చిన మొక్కజొన్న కంకులు, వేరుశనగలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • రాగి సంకటి, జొన్నరొట్టెలు, దంపుడు బియ్యం, జొన్న గట్కా, సున్నుండలు, పల్లిలలడ్డులు, నువ్వుల లడ్డులు, రాగి సంకటి, కుడుములు మొదలైనవి మంచి పోషక విలువలున్న ఆహార పదార్థాలు.
  • శీతల పానీయాలు(Cool Drinks) - ఆరోగ్యానికి హానికరం.
  • శీతల పానీయాలకు బదులుగా - నిమ్మరసం, సల్ల(మజ్జిగ), కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, పాలు తాగాలి.

Tags

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. పౌష్టికాహారం - Nutrition(5th Class EVS) | https://vinaysinfo.blogspot.com/2021/10/nutrition5th-class-evs.html
    #Nutrition #VinaysInfo

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Ads Section