కలకలా ఉడికేది కాకరకాయ
సిటసిటా ఉడికేది సిక్కుడుగాయ
నానుతూ ఉడికేది నల్ల వంకాయ
తేలుతూ ఉడికేది తెల్ల వంకాయ
బిరబిరా ఉడికేది ఈ బీరకాయ
దోరగా ఉడికేది ఆ దొండకాయ
ఆలిసెంగ ఉడికేది అనపకాయ
పప్పుతో పదహారు కూరల్లుజేసి
సిక్కుడూ బువ్వేసి సిరిపళ్లెం తోమి
కాకరా పువ్వేసి గంగాళం తోమి
బుక్కెడంత బువ్వ సారెడాంత నెయ్యి
సుట్టపంటి కూరల్ల నడుమ బువ్వుంది
తినిపొర నా కొడుక తినిపొర తండ్రి
తినిపోవే నా బిడ్డ తినిపోవే తల్లీ
Also Read : ముత్యాల చెమ్మ చెక్క - Muthyala Chemma Chekka