అల్లో నేరెడల్లో - Allo Neredallo
అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో
అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరెడల్లో
పుట్టెడు ఉస్కెల పుట్టెనోక చెట్టు అల్లో నేరెడల్లో
అల్లనేరేడి కింద సల్లాని చెలిమె అల్లో నేరెడల్లో
సల్లాని చెలిమెల్ల సద్దారగించి అల్లో నేరెడల్లో
చెంబుతో నీళ్లుబోస్తే పచ్చాని చేట్టాయే అల్లో నేరెడల్లో
అండతో నీళ్లు బోస్తే ఆకాశమంతయే అల్లో నేరెడల్లో
మీ ఇంట్ల రాజవ్వ పెండ్లిల్ల నాడు అల్లో నేరెడల్లో
ఆ చెట్టు కట్టెలు పెండ్లిపీటలు అల్లో నేరెడల్లో
ఆ చెట్టు ఆకులు పచ్చ తోరణాలు అల్లో నేరెడల్లో