పోయిరా గౌరమ్మ - Poira Gouramma
ఆటల్లో పాటల్లో చందమామ - ఆడబిడ్డలంతా చందమామ
ఉయ్యాల పాటలు చందమామ - కోలాటమాటలు చందమామ
చెలకల్లో పండిన చందమామ - జొన్నలు సజ్జలు చందమామ
సన్నని బియ్యము చందమామ - మొక్కజొన్నలను చందమామ
పొడులుగా దంచేసి చందమామ - గొప్పగా అర్పించి చందమామ
పసుపు,కుంకుమాలిచ్చి చందమామ - వాయినాలు పంచి చందమామ
మోటబాయి కాడ చందమామ - పారే వాగు కాడ చందమామ
కాలువ ఒడ్డున చందమామ - చెరువు గట్లలోన చందమామ
నిద్దుర పొమ్మంటు చందమామ - జోలపాటలు పాడి చందమామ
సల్లంగ నువ్వుండ చందమామ - సోమ్ములే ఇవ్వంగ చందమామ
పోయిరా గౌరమ్మ చందమామ - పోయిరావే గౌరి చందమామ
మల్లోచ్చే ఏడాది చందమామ - మరలిరావే తల్లి చందమామ