Type Here to Get Search Results !

Vinays Info

విత్తనాల వ్యాప్తి - Seeds Trasnportation

మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే అధ్యాయంలో పుష్పంలోని వివిధ భాగాలను గురించి నేర్చుకున్నాం. అలాగే ఫలదీకరణం తరువాత అండకోశం ఫలంగా అండాలు విత్తనాలుగా మారుతాయని, విత్తనాలన కొత్తమొక్కలు ఉత్పత్తి అవుతాయని తెలుసుకున్నాం.

ఒక రోజున రవళి వాళ్ళ ఇంటి పైకప్పు మీద టమాటా మొక్క పెరగడం చూసింది. ఇంటికప్పుమీద గింజలు ఎవరూ నాటరుకదా! అవి అక్కడికి ఎలా చేరాయి. మొక్కగా ఎలా పెరిగాయని ఎంతో ఆశ్చర్యపోయింది! పగిలిన గోడలలో, రాళ్లలో మొక్కలు పెరగడం అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అక్కడికి విత్తనాలు ఎలా చేరతాయి?

ఎవరు నాటుతారు? విత్తనాలు ఒక చోటినుంచి మరొక చోటికి ఎలా చేరతాయి? మొక్కలకు వాటి విత్తనాల వ్యాప్తికి ప్రత్యేకమయిన ఏర్పాట్లు ఉంటాయా? విత్తనాలు అనువైన స్థలాలను, అనుకూల పరిస్థితులను వెతుక్కుంటూ వ్యాప్తి చెందుతాయా? వ్యాప్తి చెందే విత్తనాలకు ఏమైనా ప్రత్యేక లక్షణాలు ఉంటాయా? వ్యాప్తికి ఉపయోగపడే అంశం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని రవళి అనుకుంది.

విత్తనాలు ఎందుకు వ్యాప్తిచెందాలి?

ఒక చెట్టు విత్తనాలన్నీ ఒకే స్థలంలో పడి మొలకెత్తి మొక్కలను ఉత్పత్తి చేస్తే ఏమవుతుంది?

అవి పెరగడానికి సరిపోయే స్థలం లభిస్తుందా?

వాటికి తగినంత సూర్యరశ్మి, నీరు లభిస్తాయా?

తగినంత వెలుతురు, నీరు లభించకపోతే అవిజీవించగలవా?

పై ప్రశ్నలకు జవాబులు దొరికిన తరువాతనే, చిన్న మొక్కలు జీవించాలంటే మొక్కలలో విత్తనాల వ్యాప్తి జరగడం అవసరమవుతుందని తెలుస్తుంది. కొత్త మొక్కలు మొలిచినప్పుడు గాలి, నీరు, ఖనిజ లవణాల కోసం తల్లిమొక్కతో పోటీపడకుండా కొంత దూరంలో మొక్కలు విత్తనాలను వ్యాపింపచేస్తాయి. విత్తనాల వ్యాప్తిలో మొక్కనుంచి మొక్కకు, విత్తనంనుంచి విత్తనానికి వ్యాప్తి చెందే విధానం వేరుగా ఉంటుంది.

విత్తనాల వ్యాప్తికి తోడ్పడే కారకాలు

 1. గాలిద్వారా వ్యాప్తి :

మీరు ఎప్పుడైనా బంతిలాంటి లేదా పారాషూట్ ఆకారంలో వెంట్రుకలున్న నిర్మాణాలు గాలిలో ఎగురుతూ పోవడాన్ని చూశారా? వీటిని ఎప్పుడైనా పట్టుకోడానికి ప్రయత్నించారా? అవి జిల్లేడు మొక్క విత్తనాలు. ఈ గింజలు తేలికగా ఉండి, వాటికి ఒక చివరన తెల్లని వెంట్రుకలుంటాయి. వెంట్రుకల్లాంటి పీచుపదార్థాలు ఎందుకు ఉపయోగపడతాయో ఆలోచించండి. ఇవి గాలిలో సులభంగా తేలుతూ అనుకూలమైన స్థలంలో చేరి పెరుగుతాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలికగా, చిన్నవిగా ఉంటాయి. కొన్ని విత్తనాలకు రెక్కలు, వెంట్రుకలు లేదా ఈకల లాంటి నిర్మాణాలు ఉండి తేలికగా ప్రయాణించడానికి

2. నీటిద్వారా వ్యాప్తి

విత్తనాలు నీటిలో ఎలా తేలుతాయి? నీటిపైన తేలే విత్తనాలు సాధారణంగా తేలికగా ఉంటాయి. విత్తనం బాహ్య కవచంలో గాలితో నిండిన ఖాళీ స్థలాలు ఉంటాయి.అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాల గింజలు గాలిలో తేలుతూ చాలా దూరం ప్రయాణం చేస్తే, కొన్ని గిరగిరా తిరుగుతూ తక్కువ దూరం ప్రయాణం చేస్తాయి.

ఆర్కిడ్ మొక్కల విత్తనాలకు గాలితో నిండిన సంచుల వంటివి ఉంటాయి.

గడ్డిచెమంతి విత్తనాలకు రెక్కల్లాంటి అమరికలు ంటాయి. పత్తిగింజలకు వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఎగరడానికి ఉపయోగపడతాయా? విత్తనాల్లో ఉండే ఇటువంటి ప్రత్యేక నిర్మాణాలు గాలిద్వారా విత్తనం వ్యాప్తికి ఎంతగానో ఉపయోగపడతాయి. 

మీ పరిసరాల్లో పెరిగే మొక్కలలో గాలిద్వారా వ్యాప్తి చెందే మరికొన్ని విత్తనాల పేర్లు తెలుసుకోండి. పట్టిక రాయండి.

మరికొన్ని రకాల విత్తనాలు వీచుతో కప్పినట్లుంటాయి. పీచు మధ్య ఉండే ఖాళీలు గాలితో నిండి ఉంటాయి. కాయ మొత్తంగా కానీ, గింజలు కానీ ఇలా కప్పినట్లుంటాయి. కొబ్బరికాయ నీటిపై తేలుతూ ఒకచోటినుంచి మరోచోటికి ప్రయాణంచేసి నేలను చేరుకుని మొలకెత్తుతుంది. అందుకే సముద్రతీరం వెంబడి కొబ్బరి చెట్లు పెరగడం మనం సాధారణంగా చూస్తుంటాం. బరువైన విత్తనాలు నీటి అడుగుకు చేరి ప్రవాహంలో కొట్టుకుపోతాయి.

ఉదా|| తామర విత్తనాలు.

నీటిద్వారా వ్యాప్తి చెందే మరికొన్ని విత్తనాల పేర్లుచెప్పండి.

(సూచన: నీటిమొక్కల గురించి ఆలోచించండి)

3. పక్షులద్వారా, జంతువులద్వారా వ్యాప్తి :

పక్షులు, జంతువుల ద్వారా కూడా విత్తనాల వ్యాప్తి జరుగుతుందని మీకు తెలుసా? మీ స్నేహితులతో చర్చించి మీకు తెలిసినవాటి జాబితా తయారుచేయండి.

జంతువుల ద్వారా విత్తనాలు చాలా రకాలుగా వ్యాప్తి చెందుతాయి. కొన్ని కండగల పండ్లను జంతువులు తింటాయి. విత్తనాలను విసర్జిస్తాయి.

మరికొన్ని ఎండిన పండ్లు జంతువుల శరీరానికి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా అంటుకుంటాయి. కొక్కేలు, ముండ్లు, వెంట్రుకల్లాంటి భాగాలు కలిగిన పండ్లు ఇలా అంటుకుంటాయి. గింజలు జంతువులకు అంటుకొని దూరప్రాంతాలకు తరలిపోతాయి.


కొన్ని గడ్డిజాతి మొక్కల్లో ఇలాంటి విత్తనాలు చూడవచ్చు.


మీరు తోటల్లో గడ్డిపొదల్లో నడిచినపుడు మీ దుస్తులకు కొన్ని రకాల పండ్లు లేదా విత్తనాలు అంటుకోడం గమనించే ఉంటారు. వాటికి కొక్కేలు లేదా ముళ్ళు ఉంటాయి. ఇలాంటి ఫలాలు, విత్తనాలు ఏవో తెలుసుకోండి.


కొన్నిరకాల విత్తనాలు జిగురుగా ఉండి పక్షుల ముక్కులకు అంటుకొని అవి ఎగురుతూ ప్రయాణిస్తున్నప్పుడు సుదూర ప్రాంతాల్లోకిందపడతాయి. తరుచుగా కొన్ని పక్షులు విత్తనాలను తమ ముక్కులతో తీసుకెళుతుంటాయి. కొన్ని విత్తనాలు గూటికి చేరకముందే దారిలో పడిపోతాయి. ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే కొన్ని విత్తనాలు మొలకెత్తే ముందు తప్పనిసరిగా కొన్ని పక్షుల జీర్ణమండలం గుండా ప్రయాణం చేయాల్సిందే.


గోరింక, బుల్బుల్పిట్ట, కాకులు, మొదలైన పక్షులు, వేపలాంటి రకరకాల పండ్లను తింటాయి. పండులో మెత్తని భాగమంతా పక్షుల ఆహార వాహికలో జీర్ణమౌతుంది. విత్తన కవచాలు మెత్తగా మారుతాయి. చివరికి పక్షుల రెట్టలద్వారా వ్యాప్తిచెందుతాయి.


అలాగే కండ ఉన్న ఫలాలను జంతువులు తింటాయి. కండను తిని విత్తనాలకు హాని కలగకుండా వదిలేస్తాయి. కొన్ని గింజలు మలంద్వారా కూడా వ్యాప్తిచెందుతాయి.


4. మానవులద్వారా వ్యాప్తి :



సాధారణంగా పూలమొక్కలు, పండ్లు, కూరగాయల గింజలు పక్కఇళ్ళనుంచి తెచ్చుకొనిగానీ, కొనితెచ్చిగానీ మన ఇళ్ళలో నాటుతాం కదా! మనం కూరలు, పచ్చళ్ళు మొదలైనవి తయారుచేయడానికి ఎక్కువగా ఉపయోగించే 'టమాటా' మన దేశానికి చెందిన కూరగాయ కాదంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ! మరి ఈ టమాటా ఎక్కడినుంచి వచ్చినట్లు? ఐరోపా వర్తకులు మనదేశానికి వచ్చినప్పుడు టమాటా, గోబిపువ్వు, జామ, పియర్ మొదలైనవాటిని తమతోపాటు ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే మనదేశానికి చెందిన చెరుకుగడ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. చక్కెర ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగింపబడుతోంది. విత్తనాలు మనుషుల ద్వారా ఒకచోటినుంచి మరొక చోటికి ఎలా బదిలీ అవుతాయో చెప్పడానికి ఇవి మంచి ఉదాహరణలు.




విత్తనాలు విమానాల్లో, స్టీమర్లలో ప్రయాణం చేసి ఒక దేశంనుంచి మరొక దేశాన్ని చేరతాయంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ! ఈ రోజుల్లో మనచుట్టూ లభించే రకరకాల పండ్లూ, కూరగాయలూ రకరకాల ప్రాంతాలనుంచి వచ్చి చేరినవే. గోధుమ, వరి, పప్పుధాన్యాలు మొదలైనవి ఎగుమతి దిగుమతి చేసుకోడం ఈ రోజుల్లో సర్వసాధారణం. వీటిద్వారా ఎన్నో రకాల ఇతర విత్తనాలు కూడా ప్రపంచమంతా వ్యాప్తిచెందుతున్నాయి.


5. పేలడంవల్ల విత్తనాల వ్యాప్తి : 

పండ్లలోో విత్తనాలు వాటి గుళిక లేదా కాయలో ఇమిడి ఉంటాయి. ఎండినప్పుడు గుళిక పేలి విత్తనాలు చాలా ఒత్తిడితో పరిసరాలలోకి చెల్లాచెదరవుతాయి. ఈ రకమైన విత్తనాలను బెండ, ఆవ, బఠానిలాంటి మొక్కల్లో చూడవచ్చు. కొన్ని ఎండిన కాయలను తాకగానే వెంటనే పగిలిపోయి చుట్టలు తిరిగిపోతాయి. దాంతోపాటు విత్తనాలు దూరంగా వెదజల్లుతాయి. కొన్ని విత్తనాలు ఇలాగే వ్యాప్తి చెందుతాయి కదా! ఈ పద్దతి ద్వారా వ్యాప్తిచెందే విత్తనాల పేర్లు రాయండి.


మీకు తెలుసా?

మతిమరుపు ఉడత :

ఉడత చలికాలంలో ఎన్నో గింజలు, పెంకున్న విత్తనాలను సేకరించి భూమిలో దాస్తుంది. కనీసం కొన్నైనా తినకముందే వాటిని ఎక్కడ దాచిందో మరిచిపోతుంది! అందుకే వివిధ స్థలాలలో ఉడత దాచిన గింజలు చెట్లుగా పెరుగుతాయి.




మీకు తెలుసా?

ఒక ఆవాల మొక్క తన జీవితకాలంలో సుమారుగా పదివేలకు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ మొలిచి మొక్కలుగా ఎదిగాయనుకోండి అప్పుడు ఎన్ని విత్తనాలు తయారవుతాయో ఊహించండి. ఇలా జరిగితే కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలో భూగోళం మొత్తం అంగుళం కూడా ఖాళీలేకుండా ఆవాల మొక్కలతో నిండిపోతుంది.



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section