నాగు పాము, కట్లపాము, సముద్ర పాము, రక్త పింజర ఈ జాతి పాములకే విషం ఉంటుంది.
పాములను - రైతు నేస్తాలు అని అంటారు.
ట్రైక్రోగ్రామాను వ్యవసాయ పరిశోధన మండలి(Icar) వారు ప్రయోగశాలలో సృష్టించారు.
దీని జీవిత కాలం - వారం రోజులు మాత్రమే.
దీని ఊఅయోగం - పంటలను పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది.
జంతువులు నుండి మనకు లభించేవి - పాలు, గుడ్లు, మాంసం, చర్మం.
ఎద్దు కొమ్ములతో గుండీలను తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి.
మనకు గాలి, నీరు, ఆహారం, దుస్తులు, నివాసం మొదలగునవి అవసరం.
వీటితో పాటు కలిసి జీవించడం, ప్రేమ,కరుణ, ఆదరణ వంటివి ఎంతో అవసరం. ఇవన్నీ జంతువులకు కూడా అవసరం.
దంతాల కోసం - ఏనుగులను
చర్మం కోసం - పులి,జింక,పాము వంటి జంతువులను వేటాడుతున్నారు.
జీవ వైవిధ్యం మనం చేయాల్సిన పనులు
పాఠశాలల్లో, ఇంటి ఆవరణలో చెట్లను పెంచాలి.
అడవిలో చెట్లను నరకకుండా చూడాలి.
మన చుట్టూ ఉన్న జంతువుల పై పక్షులపై, కరుణ, దయ, వాత్సల్యం చూపాలి. ఆహారం ఇవ్వాలి.
చేపలు వివిధ రకాల జీవులు నిలయమైన చెరువులు, నదులు, జలాశయాలను కలుషితం చేయరాదు.
ప్లాస్టిక్ పంచులు, వ్యర్థ పదార్థాలు మొదలైనవి నీటి వనరులు వేసి నీటిలో ఉన్న ప్రాణుల వినాశనానికి కారకులు కారాదు.
క్రిమిసంహారక మందులు, పెట్రోల్, బొగ్గు మొదలగు ఇంధనాలను విచక్షణ రహితంగా వాడి పర్యావరణాన్ని కలుషితం చేయరాదు,
ఇతర ప్రాణులకు జీవజాలానికి ముప్పు తెచ్చే ఎలాంటి పనులు చేయరాదు.
జంతువుల సహజ ఆవాసాలను గ్రామాలు, నగరాల అభివృద్ధి పేరిట ధ్వంసం చేయరాదు. వీలుంటే అవి బతకడానికి సహాయపడాలి.
మీ పాఠశాలలో జంతు సంరక్షణ ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయండి.
జంతు ప్రపంచం ఆల్బమ్ తయారు చేయండి.
వన్యప్రాణులను వేటాడడం నిషేధం. ఈ చట్టం గురించి ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోండి.
జంతువులపై, పక్షులపై దయ, కరుణ వాటికి చూపమని, వాటికి ఆహారం, నీళ్లు అందజేయమని అందరికీ తెలిసేలా ఒక పోస్టారు తయారుచేసి మీ గ్రామంలో ముఖ్యమైన స్థలంలో అతికించండి.