పొట్టేలు కన్నతల్లి - Pottelu Kannathalli
పొట్టేలు కన్నతల్లి గొర్రె గొర్రె
దున్నపోతు కన్నతల్లి బర్రే బర్రే
ఉమ్మేత్తకాయ తింటే వెర్రే వెర్రే
చిన్న చెల్లెకు చీమకుడితే ఒర్రే ఒర్రే
మిరపకాయ కొరికితే చుర్రే చుర్రే
బురదలోన కాలు వేస్తే పుర్రే పుర్రే
ముందుపళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రే
తొర్రి నోట్లో అంబలిపోస్తే జుర్రే జుర్రే