బతుకమ్మలెత్తుదాం! - Bathukammalethudam
- తీరోక్క రంగుల ఉయ్యాలో
- రామచిలుకలోలే ఉయ్యాలో
- ఓణీలు జడకుచ్చులు ఉయ్యాలో
- ఒయ్యార మొలకంగ ఉయ్యాలో
- బుట్టబొమ్మలోలే ఉయ్యాలో
- బుజ్జిపాపలు కదిలే ఉయ్యాలో
- అద్దాల రవికెలు ఉయ్యాలో
- ముత్యాల చీరెలు ఉయ్యాలో
- నడుముకూ వడ్డాణం ఉయ్యాలో
- నాణ్యమైన నగలు ఉయ్యాలో
- నిండైన గాజుల్లా ఉయ్యాలో
- బతుకమ్మాలెత్తిరీ ఉయ్యాలో
- భాజ భజంత్రీలు ఉయ్యాలో
- సన్నాయి డప్పుల్లా ఉయ్యాలో
- నడిచేటి పాదాలు ఉయ్యాలో
- నదులను బోలు ఉయ్యాలో
- వాడవాడెకమై ఉయ్యాలో
- ఊరి మధ్యన చేరి ఉయ్యాలో
- సొంపైన పాటల్ల ఉయ్యాలో
- బతుకమ్మలాడిరి ఉయ్యాలో