- బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో - బంగారు బతుకమ్మ ఉయ్యాలో
- కరుణించ రావమ్మా ఉయ్యాలో - కాపాడి మమ్మెలు ఉయ్యాలో
- శాంకారీ పార్వతీ ఉయ్యాలో - శాంభవీ నీవమ్మా ఉయ్యాలో
- కాశిమల్లె పూలు ఉయ్యాలో - కనకాంబరాలతో ఉయ్యాలో
- మందారపూవులు ఉయ్యాలో - మాత నిను పూజింతు ఉయ్యాలో
- పారిజాతం బంతి ఉయ్యాలో - బీరపూవుల తోడ ఉయ్యాలో
- సీతజడ పూలతో ఉయ్యాలో - శ్రీలక్ష్మీ పూజింతు ఉయ్యాలో
- మా ఊరి గౌరమ్మ ఉయ్యాలో - మా తల్లి నీవమ్మా ఉయ్యాలో
బతుకమ్మ ఆడుదాం - Bathukamma Adudam
September 30, 2021
Tags