Bathukamma Peruddam - బతుకమ్మ పేరుద్దాం
తీరైన పువ్వులనూ కోల్ - ఏరీ తెచ్చామూ కోల్
రంగుల పూలన్నీ కోల్ - రాసులుగా పోసీ కోల్
సిబ్బిల ఆకులూ కోల్ - సిత్రంగా పరిచీ కోల్
దోసీట్ల పూలన్నీ కోల్ - దొంతులుగా పెర్చీ కోల్
అమ్మమ్మ చెప్పంగా కోల్ - అందంగా తీర్చి కోల్
ఇంట్లోని వారంతా కోల్ - పూజలే చేయంగా కోల్
గౌరీశంకరున్నీ కోల్ - భక్తితో కొలువంగా కోల్
ఘనమైన బతుకమ్మ కోల్ - ఫలములనివ్వమ్మ కోల్
ఊరు ఊరంతా కోల్ - ఉత్సవమే నిండా కోల్
ఓయమ్మలక్కలూ కోల్ - రండీ పోదాము కోల్
Bathukamma Peruddam - బతుకమ్మ పేరుద్దాం | https://vinaysinfo.blogspot.com/2021/09/bathukamma-peruddam.html
ReplyDelete#vinaysinfo #mukkanibrothers