రంగు రంగుల పూలు - సన్న సన్న జల్లుల్లా వలలో
- సన్న సన్న జల్లుల్లా వలలో
- వానజల్లు కురిసే వలలో
- తోటలో పూలన్నీ వలలో
- బతుకమ్మనే అడిగే వలలో
- తంగేడు, గుమ్మడి వలలో
- బంతీ, చామంతులూ వలలో
- కలువలు, పొగడాలూ వలలో
- రుద్రాక్ష, వరహాలూ వలలో
- ముత్యాలు, గునుగులూ వలలో
- రంగురంగుల పూలూ వలలో
- చక్కని పిలగాండ్లూ వలలో
- కొమ్మ కొమ్మనే వంచీ వలలో
- ఒడిసీ పట్టంగా వలలో
- పూలసంచీ నిండే వలలో
- పక పక నవ్వంగా వలలో
- ఆనందముప్పొంగే వలలో