కాంతిచర్యలు, నిష్కాంతి చర్యల మధ్య తేడాలు
కాంతి చర్య | నిష్కాంతి చర్య |
1. కిరణజన్య సంయోగక్రియలో మొదటి దశ | 1. కిరణజన్య సంయోగక్రియలో రెండవదశ |
2. హరితరేణువులోని థైలకాయిడ్(గ్రానా)లో జరుగుతుంది. | 2. హరితరేణువులోని అవర్ణిక (స్ట్రోమా)లో జరుగుతుంది. |
3. కాంతిశక్తిని ఉపయోగించుకొని రసాయనిక కర్బన పదార్థాలు ఏర్పడతాయి. | 3. కాంతి శక్తి ప్రమేయం లేకున్నా రసాయనిక శక్తిని ఉపయోగించుకొని శక్తిగా మార్చబడుతుంది. |
4. ATP,NADPH2ను అంత్య ఉత్పన్నాలు | 4. పిండిపదార్థాలు (గ్లూకోజు) అంత్య ఉత్పన్నాలు |
5. శక్తి గ్రాహకాలు ఏర్పడతాయి. | 5. శక్తిగ్రాహకాలు వినియోగించబడతాయి |
6. దీనిలో ప్రధానంగా ఆక్సీకరణ చర్యలు జరుగుతాయి | 6. దీనిలో క్షయకరణ చర్యలు జరగుతాయి |
7. దీనిలో నీటికాంతి విశ్లేషణ- జరుగుతుంది. | 7. దీనిలో కార్బన్ స్థాపన జరుగుతుంది. |
8. ఆక్సిజన్ వాయువు విడుదలగును | 8. ఆక్సిజన్ విడుదల కాదు. |